Shekar: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటినుండో టాప్ డైరెక్టర్ గా పేరొందిన సుకుమార్ “పుష్ప” సినిమాతో దేశం మొత్తం తన వైపు చూసేలా చేసుకోవడం తెలిసిందే. ఆఖరికి టాప్ డైరెక్టర్ గా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పేరొందిన రాజమౌళి.. సైతం సుకుమార్ దర్శకత్వాన్ని కి పెద్ద అభిమాని. ఈ విషయాన్ని స్వయంగా ఆయన పలు ఇంటర్వ్యూలలో తెలియజేయడం జరిగింది. అటువంటి డైరెక్టర్ సుకుమార్ ఇండస్ట్రీలోకి రావటానికి సినిమాలపై ఇంట్రెస్ట్ పెరగడానికి మొదటి కారణం హీరో రాజశేఖర్ అని కొత్త విషయాన్ని ఇటీవల బయటపెట్టారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పూర్తి విషయంలోకి వెళ్తే హీరో రాజశేఖర్ నటించిన శేఖర్ సినిమా పరి రిలీజ్ వేడుక మే 17వ తారీకు జరిగింది. ఈ వేడుకకు సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ.. తాను చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. రాజశేఖర్ నటించిన తలంబ్రాలు, ఆహుతి, అంకుశం సినిమాలు చూసి చిన్నప్పుడే రాజశేఖర్ గారికి వీరాభిమానిని. అంతమాత్రమే కాదు మా ఊర్లో నాకొక స్నేహితుడు ఉండేవాడు అతడు హీరోలందరినీ ఇమిటేట్ చేసేవాడు. నాకు వాడిని చూస్తే అసూయ వచ్చేది. అప్పుడు నేను రాజశేఖర్ లా ఇమిటెడ్ చేసేవాడిని. దాంతో నేను మా ఊరిలో చాలా ఫేమస్ అయ్యాను.
ఊరిలో జనమంతా రాజశేఖర్ లాగా యాక్ట్ చెయ్ అని దగ్గరకు వచ్చి మరి అడిగేవాళ్ళు. దాంతో సినిమా పై ఇంట్రెస్ట్ పెరిగింది. నాలో నటుడిని ఇండస్ట్రీలోకి రావటానికి.. హీరో రాజశేఖర్ కారణమయ్యారు. ఈ విషయం ఇప్పటి వరకు ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే సందర్భం రాలేదు. మామూలుగా ఇండస్ట్రీ అంటే చాలా మంది కుటుంబ సభ్యులను దూరం పెడతారు కానీ రాజశేఖర్ వాళ్ళు ఇద్దరు కూతుళ్లను ఇండస్ట్రీలోకి తీసుకు రావడం చూస్తే పవిత్రమైన ఇండస్ట్రీ అని.. వాళ్లు రుజువు చేశారు అంటూ సుకుమార్ పేర్కొన్నారు. జీవిత గారు చేసిన ఒక్క ఫోన్ కాల్ ద్వారా ఇక్కడికి రావడం జరిగిందని ఆమె కోసం “శేఖర్” సినిమా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని సుకుమార్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.