Pushpa 2: డైరెక్టర్ సుకుమార్ అనేక వేదికలపై తన అభిమాన తార సమంత అని చాలాసార్లు చెప్పడం జరిగింది. అంతమాత్రమే కాదు ఆమెపై ఉన్న అభిమానంతోనే “పుష్ప” లో ఆమెకు ప్రత్యేకమైన క్యారెక్టర్ డిజైన్ చేసినట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. కాగా “పుష్ప” మొదటి భాగం ఎటువంటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. పాన్ ఇండియా నేపథ్యంలో రిలీజయిన “పుష్ప” విడుదలైన ప్రతి చోట రికార్డులు సృష్టించింది. సినిమాలో డైలాగులు మరియు పాటలు ఒక్క తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు దేశంలో మరియు ప్రపంచంలో సినీ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
‘ఊ అంటావా” అనే ఐటమ్ సాంగ్ అయితే ఒక ఊపు ఊపింది. ఈ పాటలో సమంత వేసిన స్టెప్పులకు.. థియేటర్లు దద్దరిల్లాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. స్టోరీకి సంబంధించి సుకుమార్ కొద్దిగా మార్పులు చేర్పులు చేస్తున్నట్లు జులై మాసం నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే రెండో భాగంలో కూడా సమంతకి ఒక క్యారెక్టర్ డిజైన్ చేసినట్లు దానికి తగ్గట్టుగానే రెమ్యూనరేషన్ కూడా ఇవ్వడానికి సుకుమార్ రెడీ అయినట్లు బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు ఇండస్ట్రీలో కొత్త వార్త వినబడుతోంది.
మరోపక్క సెకండ్ పార్ట్ “పుష్ప” లో ఐటెం సాంగ్ కోసం దిశా పటాని నీ.. సుకుమార్ తీసుకోవడానికి రెడీ అయినట్లు టాక్ నడుస్తుంది. దేశంలో యువతనీ విపరీతంగా ఆకట్టుకుంటున్న ముద్దుగుమ్మ కావడంతో సుకుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు.. వార్తలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో సెకండ్ పార్ట్ పుష్పాల సమంతాకి ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ సినిమా లో ఉండే రీతిలో సుకుమార్ డిజైన్ చేసినట్లు.. సమంతా కూడా ఒప్పుకున్నట్లు లేటెస్ట్ టాక్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది.