Sukumar: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా వెరైటీగా సినిమాలు తీసే డైరెక్టర్లలో ఒకరు సుకుమార్. భారతదేశం గర్వించదగ్గ డైరెక్ట్ రాజమౌళి సైతం సుకుమార్ సినిమాలంటే పడిచస్తారు. అంతేకాకుండా ఒకానొక సమయంలో సుకుమార్ తనకి మంచి పోటీ ఇచ్చే డైరెక్టర్ అని కూడా జక్కన్న తెలపడం జరిగింది. హీరో క్యారెక్టర్లను డిఫరెంట్ గా క్రియేట్ చేసి సుకుమార్ తీసే సినిమాలు చాలా తెలివిగా అర్థవంతంగా ఉంటాయి. అటువంటి సుకుమార్ ఇండస్ట్రీలో తానొక్కడే కాక కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయటం… తన దగ్గర పనిచేసే వారికి ఒక బాట వేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇప్పటికే తన శిష్యుడు బుచ్చిబాబు ని రంగంలోకి దింపి ఇండస్ట్రీ కి ఉప్పెన లాంటి విజయాన్ని అందించడం జరిగింది. దర్శకుడిగా..నిర్మాతగా వ్యవహరిస్తున్న సుకుమార్ … తన శిష్యులతో పాటు కొత్త టాలెంట్ కలిగిన యువతరాన్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సినిమాలు నిర్మిస్తున్నారు. “కుమారి 21ఎఫ్” సినిమా నిర్మించటం తెలిసిందే ఇప్పుడు 18 పేజీలు, ఇంకా సాయి ధరమ్ తేజ్ సినిమా ఇలా కొన్ని సినిమాలు నిర్మించడం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సుకుమార్ బాటలో ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లు టాలెంట్ ఎంకరేజ్ చేయడానికి సినిమాలు నిర్మించడానికి తమకంటూ కొత్త బ్యానర్ పెట్టుకోవడానికి రెడీ అవుతున్నారు.
Read More: Sukumar : సుకుమార్ శిష్యుడు పుష్పకి పని చేస్తున్నాడా..?
దీనిలో భాగంగా కొరటాల శివ ఆల్రెడీ తనకంటూ సెపరేట్ బ్యానర్ స్టార్ట్ చేసినట్లు .. కొంతమంది కొత్త డైరెక్టర్లను పరిచయం చేయటానికి రెడీ అయినట్లు సమాచారం. వారి చేత సినిమాలు చేయించి తన బ్యానర్ లో నిర్మించడానికి కొరటాల శివ ఇప్పటికే వారికి అడ్వాన్సు కూడా ఇవ్వడం జరిగిందట. కొరటాల శివ తో పాటు మరి కొంతమంది టాప్ డైరెక్టర్లు సైతం సుకుమార్ మాదిరిగా తమ దగ్గర పనిచేసిన శిష్యులను ప్రోత్సహించడానికి కొత్త టాలెంట్ ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి సరికొత్త బ్యానర్లు పెడుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?