ఈ ఏడాది ప్రారంభంలో “అలా వైకుంఠపురం లో” సినిమా తో అదిరిపోయే విజయాన్ని అల్లు అర్జున్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగకు వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది. ప్రస్తుతం అల్లు అర్జున్…..సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” అనే సినిమా చేస్తున్నారు. గంధపు చెక్కల స్మగ్లర్ గా లారీ డ్రైవర్ పాత్రలో ఊర మాస్ క్యారెక్టర్ లో బన్నీని సుకుమార్ చూపించనున్నట్లు వార్తలు అందుతున్నాయి.
అంతే కాకుండా సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ బన్నీ పుట్టినరోజున విడుదల చేసి ఒక్కసారిగా సినిమాపై సుకుమార్ అంచనాలు పెంచేశారు. కాగా చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల ప్రాంతాల పరిధిలో ఈ సినిమా స్టోరీ నడుస్తోందని సినిమా యూనిట్ నుండి అందుతున్న సమాచారం. ఈ సందర్భంగా చిత్తూరు యాస హీరో, హీరోయిన్లకు నేర్పించడానికి సుకుమార్ క్లాసులు తీసుకుంటున్నారట. ఇప్పటికే చిత్తూరు యాసలో సినిమాలో హీరోయిన్ రష్మిక మందన మాట్లాడేందుకు కొన్ని ఆడియో టేపులు కూడా పంపడం జరిగిందట.
అదే విధంగా అల్లు అర్జున్ కూడా ఇప్పటికే ఈ భాషపై పట్టు సాధించినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంమీద చూసుకుంటే నిజజీవితంలో లెక్కలు మాస్టారు గా పేరొందిన సుకుమార్ తాజాగా తన సినిమా కోసం మరోసారి పాఠాలు చెప్పడం తో ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో వైరల్ గా మారింది. మరోపక్క గతంలో అల్లు అర్జున్ తో ఆర్య, ఆర్య 2 సినిమాలు సుకుమార్ చేయటంతో… “పుష్ప” సినిమాపై బన్నీ అభిమానులు అంచనాలు ఓ రేంజ్ లో పెట్టుకున్నారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!