దాదాపు రెండున్నర దశాబ్దాలకు పైగానే తెలుగు సినిమా రంగంలో అనేక విజయవంతమైన చిత్రాలు తీసిన డైరెక్టర్ ఎన్ శంకర్ “RRR”కి ఆస్కార్ ఇవ్వాలని మద్దతు తెలిపారు. ఇదే సమయంలో ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ సభ్యులు.. ఆస్కార్ కి “RRR” నామినేట్ చేయకపోవటాని తప్పు పట్టారు. ఇంకా ఆస్కార్ కి “చలో షో” నామినేట్ చేయటం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “చలో షో” వంటి సినిమాలు దక్షిణాదిలో చాలా వచ్చాయని అన్నారు. అసలు ఏ కోణంలో ఆ సినిమాని ఆస్కార్ కి నామినేట్ చేశారా అసలు అర్థం కావటం లేదని తెలిపారు. “RRR”ను జ్యూరీ పంపకపోవడం విడ్డూరం అన్నారు.
“RRR”లో దేశభక్తితో పాటు గొప్ప నిర్మాణ విలువలు ఉన్నాయని తెలిపారు. స్టేట్ అవార్డుకు ఆస్కార్ అవార్డుకు కూడా తేడా తెలియనివాళ్లు సెలక్షన్ కమిటీలో ఉంటే ఇలానే ఉంటుందని.. డైరెక్టర్ ఎన్ శంకర్ అసహనం వ్యక్తం చేశారు. ఎన్.శంకర్ దర్శకత్వంలో.. అప్పట్లో ఆయుధం, జయం మనదేరా, రామ్, శ్రీరాములయ్య… ఇంకా చాలా సినిమాలు రావడం జరిగింది. దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎన్ శంకర్ చాలా సీనియర్. దీంతో ప్రపంచవ్యాప్తంగా భారత చలనచిత్ర రంగం యొక్క స్థాయి పెంచిన “RRR” నీ కాదని గుజరాతి సినిమా “చలో షో”.. నామినేట్ చేయటం పట్ల.. ఎన్ శంకర్ మాత్రమే కాదు ఇంక చాలామంది అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మరోపక్క “RRR”కు ఇండియా నుండి అధికారిక ఎంట్రీ లేకపోయినా గాని.. అంతర్జాతీయ సినిమాగా ఆస్కార్ అవార్డుల కోసం పోటీ పడవచ్చు అని అంటున్నారు. అకాడమీ నిబంధనల ప్రకారం 2022లో విడుదలైన చిత్రాలు లాస్ ఏంజెల్స్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఒక వారం ప్రదర్శిత కలిగి ఉంటే చాలు. జనరల్ ఎంట్రీ కేటగిరిలో నామినేషన్ కోసం అప్లై చేసుకోవచ్చు అంట. అంతేకాదు ఈ రీతిగా అప్లై చేసుకోవడానికి నవంబర్ 15వ తారీకు వరకు అవకాశం ఉందట. దీని ద్వారా పలు కేటగిరీలో నామినేషన్స్ కోసం ప్రయత్నించవచ్చు. మరి ఈ రీతిగా నైనా “RRR” ఆస్కార్ కి నామినేట్ అవుతుందో లేదో చూడాలి.
Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!