Teja: ఒకప్పుడు హిందీ ఇండస్ట్రీకు చెందిన వాళ్ళు దక్షిణాది సినిమా రంగం పై చాలా చిన్నచూపు చూసే వాళ్ళు. కనీస గౌరవం కూడా ఇచ్చే పరిస్థితి నార్త్ ఇండియా సినీ పెద్దలు.. సౌతి ని పరిగణలోకి తీసుకునే వాళ్లు కాదు. ఇదే విషయాన్ని ఒకానొక సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా…. కొన్ని సినీ ఫంక్షన్లలో తెలియజేశారు. ఒకప్పుడు ఇటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు.. సౌత్ సినిమా రంగానికి హిందీలో భారీ డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా “బాహుబలి” తో ఒక్కసారిగా సీన్ మొత్తం మారిపోయింది.
ఇండియాలో ఎన్ని ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన “బాహుబలి”.. రాకతో సౌత్ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది దర్శకులతో హిందీ హీరోలు సినిమాలు చేయడానికి ప్రస్తుతం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా, పూరి జగన్నాథ్, వివి వినాయక్, గౌతమ్ తిన్ననూరి. ఇప్పుడు ఇదే రీతిలో మరో స్టార్ డైరెక్టర్ హిందీ లో బిజీ అవుతున్నారు. ఆయన మరెవరో కాదు డైరెక్టర్ తేజ. ఏకంగా హిందీలో రెండు ప్రాజెక్టులు చేయడానికి తేజ రెడీ అయినట్లు.. టైం ఫిలిమ్స్ అసోసియేషన్… స్టూడియోస్.. ట్రై ఫ్లెక్స్ ఫిలిమ్స్.. ఈ సినిమాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త హీరోలను పరిచయం చేసే విషయంలో కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేసే దిశగా… డైరెక్టర్ తేజ ప్రాజెక్టులు ఉండేవి. దివంగత ఉదయ్ కిరణ్ ఇంకా నితిన్ వంటి హీరోలను.. ఇండస్ట్రీకి అందించడం జరిగింది. అటువంటి డైరెక్టర్ తేజ ఇప్పుడు హిందీలో భారీ ఎత్తున వెబ్ సిరీస్ లు చేయడానికి.. రెడీ అవుతూ ఉండటం టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.