SSMB 28: “సర్కారు వారి పాట” విడుదలైన వెంటనే మహేష్.. త్రివిక్రమ్ తో సినిమా స్టార్ట్ చేస్తారని అందరూ భావించారు. కానీ ఇప్పటివరకు షూటింగ్ స్టార్ట్ చేయలేదు. “SSMB 28” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు “సర్కారు వారి పాట” రిలీజ్ అవ్వకముందే హైదరాబాదులో కంప్లీట్ అవ్వడం జరిగింది. దీంతో సినిమా చాలా త్వరగా స్టార్ట్ అవుతుందని అందరూ భావించారు. కాని తాజా పరిస్థితి చూస్తే చాలా భిన్నంగా ఉంది. మహేష్ సర్కారు వారి పాట తర్వాత యూరప్ ట్రిప్ వెళ్లిన మహేష్ ఇంకా రాలేదు. దీంతో సినిమా షూటింగ్ ఈ నెల చివరిలో లేకపోతే జూలై ప్రారంభంలో స్టార్ట్ అవుతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. మహేష్ ఇంకా వచ్చే లోపు లేట్ అవ్వుతుండటంతో…త్రివిక్రమ్ సెన్సేషన్ నిర్ణయం తీసుకున్నట్లు ఫిలిం నగర్ టాక్.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మేటర్ లోకి వెళ్తే డైరెక్టర్ త్రివిక్రమ్… మహేష్ వచ్చేలోపు సినిమాకి సంబంధించి మ్యూజిక్ పార్ట్ కంప్లీట్ చేయడానికి రంగంలోకి దిగడం జరిగింది అని టాక్. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో.. పాటలు మరియు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కి సంబంధించి త్రివిక్రమ్ చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆగస్టు నెలలో మహేష్ పుట్టినరోజు సందర్భంగా.. సినిమాకి సంబంధించి చిన్నపాటి వీడియో రిలీజ్ చేయాలని దానికి తగ్గ మ్యూజిక్ విషయంలో ముందుగా త్రివిక్రమ్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
“అరవింద సమేత వీర రాఘవ” నుండి త్రివిక్రమ్ మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ తో పని చేస్తూ వస్తున్నారు. అంతకుముందు దేవి శ్రీ ప్రసాద్.. ఎక్కువగా త్రివిక్రమ్ సినిమాలు చేయడం జరిగింది. ఏది ఏమైనా మహేష్ బాబు తో చేస్తున్న మూడో సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి టైం పట్టే అవకాశం ఉండటంతో ఈ లోపు మ్యూజిక్ కి సంబంధించిన వర్క్ కంప్లీట్ చేసే దిశగా డైరెక్టర్ త్రివిక్రమ్ అడుగులు వేస్తున్నారు అట. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మహేష్ బాబుతో త్రివిక్రమ్ సినిమా చేస్తూ ఉండటంతో “SSMB 28” పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!