న్యూస్ సినిమా

Raviteja: రవితేజ ఇచ్చిన ప్లాన్‌కు దర్శక, నిర్మాతలు నోరెళ్ళబెట్టారట..వర్కౌట్ అయితే అందరూ ఇదే ఫాలో అవుతారు..

Share

Raviteja: రవితేజ ఇచ్చిన ప్లాన్‌కు దర్శక, నిర్మాతలే నోరెళ్ళబెట్టారట. ఒకవేళ ఇది గనక వర్కౌట్ అయితే అందరూ దర్శక నిర్మాతలు తమ సినిమాలకు ఇదే ఐడియాను ఫాలో అవుతారని తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చి చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఆరు సినిమాలలో నటిస్తున్నాడు మాస్ మహారాజ రవితేజ. అందులో ఒకటి రావణాసుర. ఈ మధ్యనే ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభమైంది. ఇందులో అక్కినేని హీరో సుశాంత్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన పాల్గొనే సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరిస్తున్నారు.

directors-and-producers-are-shocked-by-raviteja-p
directors-and-producers-are-shocked-by-raviteja-p

అయితే దీని తర్వాత జరపబోయో షెడ్యూల్‌లో రవితేజ జాయిన్ అవుతారని తాజా సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. చాలాకాలంగా రియల్ లొకేషన్‌లో సినిమాలను తెరకెక్కించడం తగ్గిపోయింది. దాదాపు అన్నీ సినిమాలకు భారీ సెట్స్ వేసి నిర్మిస్తున్నారు.
అంతే కాదు సగభాగం చిత్రీకరణ అవుట్ డోర్ లోకేషన్స్‌లో ప్లాన్ చేస్తున్నారు. కానీ, ‘రావణాసుర’ సినిమాకు మాత్రం అన్ని రియల్ లొకేషన్స్ లోనే చిత్రీకరించేలా హీరో రవితేజ మేకర్స్ కి ఐడియా ఇచ్చారట.

Raviteja: పర్మిషన్స్ కరెక్ట్‌గా దొరికితే షూటింగ్ కూడా త్వరగానే పూర్తవుతుంది.

ఇలా రవితేజ ఇచ్చిన డిఫరెంట్ షూటింగ్ ప్లాన్‌తో షూటింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ కోసం ప్రత్యేకించి ఎలాంటి సెట్లను నిర్మించడంలేదని అంటున్నారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా హాస్పిటల్, సిటీ కాలేజ్ లైబ్రరీ లాంటి ఫేమస్ లొకేషన్స్‌లో రావణాసుర సినిమా షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేశారట. దీనివల్ల నిర్మాతకు చాలా
బడ్జెట్ సేవ్ అవుతుంది. పైగా పర్మిషన్స్ కరెక్ట్‌గా దొరికితే షూటింగ్ కూడా త్వరగానే పూర్తవుతుంది. ఇదే ప్లాన్ రవితేజ చెప్పడంతో దర్శక, నిర్మాతలు మారు మాట్లాడకుండా ప్రొసీడ్ అవుతున్నారట. కాగా ఖిలాడి సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు మాస్ మహారాజ.


Share

Related posts

బ్రేకింగ్..నగరంలో న్యూఇయర్ వేడుకలకు బ్రేక్

somaraju sharma

Job Notification: ఇంటర్మీడియట్ తో ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగం పొందండిలా..!!

bharani jella

తుఫానుగా మారనున్న అల్పపీడనం

Mahesh
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar