న్యూ లుక్‌లో రవితేజ అంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో తెగ హల్ చేసింది. చాలా మంది ఓ ఫొటోను చూసి రవితేజ కుర్రాడిలా మారిపోయాడంటూ అనుకున్నారు. అయితే ఆ ఫొటో ఫేక్ అంటూ చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటో ఫేక్ అని.. త్వరలోనే తాము ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేస్తామని చిత్ర దర్శకుడు వి.ఐ.ఆనంద్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ, వి.ఐ.ఆనంద్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘డిస్కోరాజా’. రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్, నభా నటేశ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదలవుతుంది.
previous post
next post