సినిమా

Prabhas: `లోఫ‌ర్‌` బ్యూటీతో ప్ర‌భాస్ రొమాన్స్‌.. అస‌లు క‌థేంటంటే?

Share

Prabhas: డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిన `లోఫ‌ర్‌` మూవీతో సినీ కెరీర్ స్టార్ట్ చేసిన హాట్ బ్యూటీ దిశా పటాని.. `ఎమ్ఎస్‌. ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ` మూవీతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఇక ఆ త‌ర్వాత టాలీవుడ్ వైపు చూడ‌లేదు. బాలీవుడ్‌లోనే వ‌రుస అవ‌కాశాలు అందుకుంటూ ఫుల్ బిజీగా దూసుకుపోతోంది.

అయితే ఇప్పుడు ఈ బ్యూటీతో రొమాన్స్‌కు రెడీ అయ్యాడు ప్ర‌భాస్‌. అస‌లు క‌థేంటంటే.. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేస్తున్న చిత్రాల్లో `ప్రాజెక్ట్‌-కె` ఒక‌టి. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొనె హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నాడు.

పాన్ వ‌ర‌ల్డ్ మూవీగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఇప్ప‌టికే కొంత షూటింగ్‌ను కూడా కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ చిత్రంలో మ‌రో హీరోయిన్ కూడా ఉండ‌బోతోద‌ట‌. ఆ పాత్ర కోసం మేక‌ర్స్ దిశా ప‌టానీని ఎంపిక చేశారు. అంతేకాదు, షూటింగ్‌లో జాయిన్ అవ్వ‌మ‌ని ఆహ్వానం కూడా పంపింది. ఈ విష‌యాన్ని దిశా ప‌టాని సోష‌ల్ మీడియా ద్వారా స్వ‌యంగా వెల్ల‌డించింది.

అలాగే ప్రాజెక్ట్ కె టీమ్ పంపిన వెల్‌క‌మ్ కిట్ ఫొటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది. త్వ‌ర‌లోనే ఆమె షూటింగ్‌లో జాయిన్ కానుంది. మొత్తానికి చాలా కాలం త‌ర్వాత మ‌ళ్లీ టాలీవుడ్‌లోకి అడుగు పెట్ట‌బోతున్న దిశా.. ఇక్క‌డ ఏ మేర‌కు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుందో చూడాలి.


Share

Related posts

Payal rajputh : పాయల్ రాజ్‌పుత్ ఇండస్ట్రీ మారుతోందా..?

GRK

సుశాంత్ సింగ్ కేసు : సుశాంత్ కి తెలియకుండానే అతని బాడీలోకి రియా ఇవి ఎక్కించిందా ??

sekhar

Samantha: ఆ సీన్స్‌లో అదరగొట్టింది..సినిమాలో అవే స్పెషల్..!

GRK