Dj tillu: DJ టిల్లు.. ప్రస్తుతం DJ టిల్లు రీసౌండ్ బాగానే వినబడుతోంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో DJ టిల్లు సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. ఇక సినిమా సక్సెస్ అయిన సందర్భంగా చిత్ర యూనిట్ తమ విజయోత్సవాన్ని ఊరూరా తిరిగి పంచుకుంటోంది. ఈ క్రమంలో DJ టిల్లు హీరో సిద్ధు చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు. ప్రేక్షకుల అభిమానం పూర్తిస్థాయిలో పొందేందుకు 12 ఏళ్లు వేచి చూడాల్సి వచ్చిందని చాలా ఎమోషనల్ గా అన్నారు. సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రంలో డీజే టిల్లు సినిమా విజయోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది.
Bhumika: ఆ సూపర్ హిట్ సాంగ్‌కి భూమిక డ్యాన్స్ ఇరగదీసిందిగా.. వీడియో వైరల్!
Dj tillu: గుంటూరు టాకీస్ మేటర్:
ఈ సందర్భంగా హీరో సిద్ధు మాట్లాడుతూ, సినిమా పరిశ్రమలో ఏదో సాధించాలని ప్రతి ఒక్క నటుడికి ఉంటుంది. అలాంటి ఆశలతోనే చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టానని అన్నాడు. అయితే ఆ కల ఈ రోజు నెరవేరిందన్నారు. గుంటూరు టాకీస్ సినిమా విజయం సాధించినా.. అనుకున్నంత పేరు రాలేదని, ఎన్నో భయాందోళన పరిస్థితుల మధ్య డీజే టిల్లు సినిమాను చిత్రీకరించామన్నారు. ఆ కష్టానికి ప్రతిఫలం ఈ రోజు దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సినిమాలోని డైలాగ్ చెప్పి ప్రేక్షకులను అలరించారు.
Ram Charan-Naga Chaitanya: నాగ చైతన్య బాటలోనే రామ్ చరణ్.. త్వరలోనే ఆ ప్రకటన?
హీరోయిన్ అభిప్రాయం:
ఇక హీరోయిన్ నేహా మాట్లాడుతూ, వైజాగ్‌లో వేరే సినిమా షూటింగ్లో వున్నపుడు DJ టిల్లు సినిమా ఆఫర్ వచ్చిందని, ఇప్పుడు అదే వైజాగ్‌లో సినిమా విజయోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇక డైరెక్టర్ విమల్ మాట్లాడుతూ.. తన స్కూల్ ఫంక్షన్లు ఇదే సిటీలో జరిగాయని, ఇక్కడే వేదికలపై చాలా సార్లు డ్యాన్స్‌లు చేశానని గుర్తు చేసుకున్నారు. వైజాగ్‌కు చెందిన తనను ఈ వేదికపై నిలబెట్టిన సినీ అభిమానులకు రుణపడి ఉంటానన్నారు.