ఇలియానా అంటే అందరికి గుర్తొచ్చేది తన నడుమొపులతో చేసే బెల్లి డాన్స్. కామన్ ఆడియన్స్ నుంచి మన హీరోల వరకు చాలామంది ఇలియానా నడుకు ఫ్యాన్స్ అంటే నమ్మి తీరాల్సిందే. అంతేకాదు ఇలియానాకి త నడుమంటే చాలా ఇష్టమట. బెల్లి డాన్స్ అంటే ఇలియాని చాలా హుషారుగా ఉంటుందని చెప్పుకొచ్చిన సందర్భాలున్నాయి. టాలీవుడ్ లో ‘దేవదాసు’ సినిమాతో అడుగు పెట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘పోకిరి’ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
దాంతో తెలుగులో స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుని ఒక వెలుగు వెలిగింది. ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకుంది. ఒకానొక సమయంలో టాలీవుడ్ లో హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అంటే ఇలియానా దే. అంతగా స్టార్ డం ని సంపాదించుకుంది. అయితే టాలీవుడ్ లో ఊపిరాడనంతగా సినిమాలు చేస్తూ కూడా బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంది. బర్ఫీ లాంటి సినిమాతీ హిందీ సీమలోను క్రేజ్ ని సంపాదించుకుంది. అయితే ఒక్కసారిగా ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో ఇలియానా గ్రాఫ్ మొత్తం పడిపోయింది. పట్టించుకున్న నాధుడే లేకుండా ఓయాడు.
ఇక ఆ మధ్య రవితేజ నటించిన అమక్ అక్బర్ ఆంటోని సినిమాతో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఇలియానా అనుకున్న ఆశలు ఆవిరైపోయాయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు ఇలియానా వర్కౌట్ వీడియోస్ తో పాటు కుర్రకారుకి హీటెక్కించే ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్ కి పిచ్చెక్కిస్తుంది.
అంతేకాదు హాట్ హాట్ డ్రెసుల్లో అప్పుడప్పుడు ఫ్యాన్స్ తో ముచ్చటిస్తుంది కూడా. ఈ సందర్భంగా ఒక ఫ్యాన్ ఇలియానాని ఒక చిలిపి ప్రశ్నఅడిగాడు. మీ బాడీ మీద ఎన్ని టాటూస్ ఉన్నాయి అని. అందుకు ఇలియానా ఫ్యాన్ కి రిప్లై ఇస్తూ 5 ఉనాయని చేతి వేళ్ళు చూపిస్తూ ఆన్సర్ చెప్పింది. అప్పుడప్పుడు తన ఒంటిమీద ఉన్న ఆ టాటూస్ కనిపించేలా డ్రెస్ వేసుకుంటుంది కాబట్టే ఫ్యాన్ కి ఇలాంటి సిలీ డౌట్ వచ్చినట్టుంది. ఇక ఇలియానా నటించిన ‘ది బిగ్ బుల్’ సినిమా ఓటీటీ లో రిలీజ్ కాబోతుండగా నాగార్జునతో కలిసి ఇలియానా బాలీవుడ్ రిమేక్ రైడ్ లో నటిస్తుందని వార్తలు వస్తున్నాయి.