Nuvvu Naaku Nachav: విక్టరీ వెంకటేష్ కెరీర్ లో తిరుగులేని సూపర్ డూపర్ హిట్ సినిమా “నువ్వు నాకు నచ్చావ్”. 2000వ సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. లవ్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కి విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. వెంకటేష్ సరసన ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా నటించడం జరిగింది. ముఖ్య పాత్రలో చంద్రమోహన్, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, తనికెళ్ల భరణి మరికొంత మంది నటీనటులు నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు రాయడం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పనీపాటా లేని ఒక పల్లెటూరికి చెందిన కుర్రోడు పైగా స్నేహితుడికి కొడుకు..నీ ప్రయోజకుడు చేయటానికి పల్లెటూరి లో ఉన్న తండ్రి పట్నం లో ఉన్న తన స్నేహితుడు ఇంటికి పంపించడం జరుగుతుంది. అలా తండ్రి స్నేహితుడు వద్దకు వెళ్లిన వెంకటేష్… పల్లెటూరు మాదిరిగానే అల్లరిచిల్లరిగా తిరుగుతూ ఉద్యోగం సంపాదించి చివరాకరికి… తండ్రి స్నేహితుడు కూతురు ప్రేమ లోనే పడటం జరుగుతుంది. అయితే తండ్రి స్నేహం పోకుండా… కూతురు పై ప్రేమ ఉన్న గాని దాని లోలోపల దాచుకుంటూ… చాలా ఎమోషనల్ గా.. వెంకటేష్ క్యారెక్టర్ ఉంటుంది. ఆర్తి అగర్వాల్ తో రొమాంటిక్ చేయాలా వద్దా అన్న తరహాలో… వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా ఉంటాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక ఇదే సమయంలో సునీల్, బ్రహ్మానందం కామెడీ… ఇప్పటికీ కూడా సినిమా చూస్తే అందరికీ నవ్వొస్తోంది. అప్పట్లో రిలీజ్ అయిన ఈ సినిమా.. చాలా సెంటర్లలో 100 రోజులు ఆడింది. క్లాస్ మాస్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఫస్ట్ ఈ సినిమా స్టోరీ.. డైరెక్టర్ విజయ భాస్కర్ మొదట… అప్పట్లో లవర్ బాయ్ గా ఇండస్ట్రీలో చలామణి అవుతున్న తరుణ్ కి చెప్పటం జరిగిందట. స్టోరీ విన్న తర్వాత తరుణ్ తో చెప్పాడంట. ఆ తర్వాత వెంటనే విజయ భాస్కర్ విక్టరీ వెంకటేష్ కి.. చెప్పడంతో వెంటనే ఒప్పుకోవడంతో.. షూటింగ్ స్టార్ట్ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని ప్రేక్షకులకు ఇవ్వటం జరిగిందట. ఈ రీతిగా నువ్వు నాకు నచ్చావ్.. సినిమాని తరుణ్ మిస్ చేసుకోవడం జరిగిందట.