మహేష్ బాబు ఒక్క ‘యాడ్’కి ఎంత తీసుకుంటాడో తెలుసా?

సూపర్ స్టార్, ప్రిన్స్ మహేశ్ బాబు క్రేజ్ రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఎన్నో హిట్ సినిమాలతో ముందుకు దూసుకుపోతున్నాడు మిల్క్ బాయ్ మహేశ్ బాబు. ఇంకా చెప్పాలంటే యాడ్స్ తో రచ్చరచ్చ చేసేస్తున్నాడు. థమ్స్అప్ యాడ్ తో స్టంట్ లు చేస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాడు. సెలబ్రిటీలు ఒక్క మాట మాట్లాడో, చిన్న డ్యాన్స్ స్టెప్ వేసే ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే వారు చూపించిన వస్తువుల విలువను అమాంతం పెంచేస్తుంటారు. అందులో టాప్ యాడ్ లతో దూసుకుపోతున్నాడు కలల రాకుమారుడు ప్రిన్స్ మహేష్ బాబు..

యాడ్ చేయమని శ్రీమంతుని వెనుక క్యూ కడతాయి యాడ్ ఏజెన్సీలు… మరి అంతలా పాపులర్ అయ్యారు మన మహేశ్ బాబు. సినీ రంగంలో అంతో ఇంతో పేరుంటే చాలు ఆ హీరోతో యాడ్ లు చేయిస్తుంటారు యాడ్ ఏజెన్సీలు. మరి ప్రిన్స్ పేరును ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ లో తనకంటూ ఒక బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నారు. మరి యాడ్ లతో మన శ్రీమంతుడు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో మీకెవరికైనా తెలుసా… అయితే ఇది తెలియాలంటే ఈ ఆర్టికల్ ను చదివేయండి..

చిన్న చిన్న హీరోలే ఓ రేంజ్లో రెమ్యునరేషన్ ను డిమాండ్ చేసేస్తుంటే మరి స్టార్ హీరోల పరిస్థితి ఎలాగుంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులో మన ప్రిన్స్ ఎంత రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నాడనే డౌట్ అందరికీ రావచ్చు. మరి మన హీరో మహేశ్ బాబు సినిమాల్లోనూ రెమ్యునరేషన్ ను భారీగానే అందుకుంటున్నారు. అందులో యాడ్స్ లోనూ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో తెలుసా.. అక్షరాల 5 నుంచి 10 కోట్లు తీసుకుంటున్నారట.

ఒక థమ్స్ అప్ యాడ్ నే రకరకాల స్టంట్ లు చేసేస్తుంటారు. అలాగే సంతూర్, బైజూస్, డెన్వర్ వంటి బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసీడర్ గా మన మిల్క్ బాయ్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వీటితో శ్రీమంతుడు దాదాపుగా 5 నుంచి 10 కోట్లు తీసుకుంటున్నట్లు తెలిసింది. దీనితో పాటుగా ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కు కూడా బ్రాండింగ్ చేస్తున్నారు. దీనికి కూడా మహేశ్ రెమ్యునరేషన్ భారీగానే తీసుకుంటున్నారటా..