RRR: ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద సినిమా ఇండస్ట్రీ హాలీవుడ్. భారీ ఎత్తున నిర్మాణ వ్యయంతో పాటు.. సరికొత్త టెక్నికల్ వర్క్ తో… హాలీవుడ్ సినిమాలు తెరకెక్కుతుంటాయి. ప్రపంచంలో ఏ దేశం లోకి వెళ్ళిన హాలీవుడ్ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. అందువల్లే హాలీవుడ్ సినిమాలు కొన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు హాలీవుడ్ తర్వాత ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ నెలకొంది. వాస్తవానికి హాలీవుడ్ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీ అనేసరికి బాలీవుడ్ గురించి మాట్లాడుకునే వాళ్ళు.
కానీ బాహుబలి రిలీజ్ అయిన తర్వాత డైరెక్టర్ రాజమౌళి గురించి మాట్లాడుకునే పరిస్థితి వరల్డ్ వైడ్ సినిమా రంగంలో నెలకొంది. కారణం చూస్తే ఇండియాలో కూడా ఇప్పుడు వెయ్యి కోట్ల దిశగా సినిమాలు కలెక్షన్లు సాధిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన సినిమాల లిస్టు చూస్తే దంగల్, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్. ఈ మూడు సినిమాలు కూడా.. భారీ ఎత్తున నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాయి.
ఈ మూడింటిలో రెండు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు కావడం విశేషం. ఏది ఏమైనా భారతీయ చలన చిత్ర రంగానికి చెందిన సినిమాలకి కూడా ప్రపంచ వ్యాప్తంగా.. మంచి గుర్తింపు వస్తూ ఉండటంతో పాటు కలెక్షన్లు కూడా ఆ దిశగా విదేశాలలో రావటం విశేషం. “బాహుబలి” తర్వాత ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సీన్ మొత్తం మారిపోయిందని సినిమా మేకర్స్ అంటున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు చాలా సినిమాలు పాన్ ఇండియా నేపద్యంలో.. సినిమాలు నిర్మించడం జరుగుతుంది. దీంతో వెయ్యి కోట్ల మార్క్ లో మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!