సౌత్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో తమన్నా భాటియా ఒకరు.. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా ఎదిగింది మిల్కీ బ్యూటీ తమన్నా.. ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఇక దర్శకుడు రాజమౌళి రూపొందించిన బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది.. తమన్నా భాటియా ప్రస్తుతం తెలుగు, తమిళం మూవీస్ తో పాటు వెట్ సిరీస్ చేస్తూ భారీగా సంపాదిస్తోంది..
ఈ మిల్కీ బ్యూటీ సినిమాలే కాకుండా తన ఫ్యాషన్ లుక్ కారణంగా వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘బబ్లీ బౌన్సర్’ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ డిఫరెంట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ త్వరలోనే హాట్ స్టార్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా జరుగుతున్నాయి. తమన్నా కూడా రిచ్ లుక్ లో పమోషన్స్ చేస్తోంది.
సాధారణంగా సెలబ్రిటీలు ఎక్కడికెళ్లిన ఎంతో ఖరీదైన వస్తువులను ఉపయోగిస్తుంటారు. ఖరీదైన డ్రస్సులతో పాటు ఖరీదైన వాచీలు, హ్యాండ్ బ్యాగులతో కనిపిస్తుంటారు. ఇటీవల ఈ మిల్కీ బ్యూటీ ఎయిర్ పోర్టులో మీడియాకు, ఫొటో గ్రాఫర్లకు ఫోజులు ఇచ్చింది. విమానాశ్రయంలో తమన్నా డిఫరెంట్ స్టయిల్ లో ఆకర్షించింది. ఆమె వేసుకున్న డ్రస్ సాధారణంగానే ఉన్నా.. ఆమె పట్టుకున్న బ్యాగ్ మాత్రం ఇప్పుడు వార్తల్లో నిలిచింది..
తమన్నా తన చేతిలో ‘బర్బెర్రీ’ బ్రాండ్ కి చెందిన ఖరీదైన బ్యాగ్ ను పట్టుకుంది. చూడటానికి ఈ బ్యాగ్ ఎంతో సింపుల్ గా కనిపిస్తున్న.. దీని ధర అక్షరాల రూ.90 వేల రూపాయలట.. అందుకే ఆ బ్యాగ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.. తమన్నా తన డ్రెస్సింగ్ స్టయిల్ తోనే కాకుండా తన హ్యాండ్ బ్యాగ్ తో కూడా ఆకట్టుకుంది. గతంలోనూ తమన్నా ఇలాంటి ఖరీదైన వస్తువులతో కనిపించింది. ఇక తమన్నా నటించిన బబ్లీ బౌన్సర్ సినిమా సెప్టెంబర్ 23న హాట్ స్టార్ లో విడుదల కానుంది. ఈ సినిమాకు మధుర్ బండార్కర్ దర్వకత్వం వహించారు. ఈ సినిమాలో ఒక లేడీ బౌన్సర్ గా కనిపించబోతోంది ఈ మిల్కీ బ్యూటీ.. బబ్లీ బౌన్సర్ మూవీ హిందీ, తెలుగు, తమిళం భాషల్లో విడుదల కానుంది..