NewsOrbit
Entertainment News సినిమా

Shanmukh Jaswanth: ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ నెల సంపాదన ఎంతో తెలుసా..?

Share

Shanmukh Jaswanth: సోషల్ మీడియా వచ్చాక ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు చదువు తర్వాత ఉద్యోగాల కోసం కంపెనీల చుట్టూ తిరిగేవారు. కానీ సోషల్ మీడియాలో రకరకాల యాప్స్ మరియు ప్లాట్ ఫార్మ్స్ ద్వారా ఎవరికి వారు తమ టాలెంట్ చూపించి గుర్తింపు సంపాదించుకొని భారీగా డబ్బులు దండుకుంటున్నారు. ఈ రకంగానే యూట్యూబ్ లలో షార్ట్ ఫిలిమ్స్ చేసి షణ్ముఖ్ తెలుగు రాష్ట్రాలలో మంచి గుర్తింపు సంపాదించాడు. కేవలం షార్ట్ ఫిలిమ్స్ మాత్రమే కాకుండా యూట్యూబ్ లో కవర్ సాంగ్స్ చేస్తూ ఫేమస్ అయ్యాడు. “సాఫ్ట్ వేర్ డెవలపర్” అనే వెబ్ సిరీస్ షణ్ముఖ్ కి మంచి గుర్తింపు లభించింది.

Do you know the famous YouTuber Shanmukh monthly earnings

ఈ వెబ్ సిరీస్ లో అద్భుతమైన నటనతో ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయాడు. ఆ తరువాత సూర్య, స్టూడెంట్ అనే షార్ట్ ఫిలిమ్స్ లో నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ మూడు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి ఎంత పేరు సంపాదించాడు. అంతేకాదు ఏ యూట్యూబర్ కూడా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సంపాదించని రేంజ్ లో ఈ నటుడు సంపాదిస్తున్నాడట. ఇది మూడు ఫిలిమ్స్ కి ఏకంగా 20 కోట్ల వరకు సంపాదించారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ప్రతినెలా ఇన్ఫినిటీ అనే మీడియా సంస్థ ద్వారా ఐదు లక్షల వరకు పారితోషకం కూడా అందుకుంటున్నాడట.

Do you know the famous YouTuber Shanmukh monthly earnings

ఈ రకంగా ఎంతో పాపులారిటీ సంపాదించిన షణ్ముఖ్…బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో కూడా రాణించి రన్నర్ గా నిలిచాడు. ఆ తర్వాత ఆహా ఓటీటీ లో పలు వెబ్ సిరీస్ చేస్తూ.. విజయవంతమైన కెరియర్ షణ్ముఖ్ కొనసాగిస్తున్నాడు. “బేబీ” సినిమాలో హీరోయిన్ వైష్ణవి చైతన్య కూడా షణ్ముఖ్ నటించిన షార్ట్ ఫిలిమ్స్ చేసి మొదట గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత విజయవంతంగా ప్రస్తుతం సినిమా రంగంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇదే రకంగా షణ్ముఖ్ కూడా సినిమా రంగంలో వచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.


Share

Related posts

బిగ్ బాస్ 4 : అఖిల్ నిజంగానే అంత డబ్బు నష్టపోయాడా..! అతని రెమ్యునరేషన్ వివరాలివిగో…

arun kanna

బిగ్ బాస్ 4 : షాక్..! ఇంటిలో మరో కొత్త జంట..? సడన్ గా ప్రపోజ్ చేసేశాడే..

Teja

Rang De : “చూసి నేర్చుకోకు” అంటున్న నితిన్..!!

bharani jella