16.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
సినిమా

Puri Jagannadh: చిరంజీవి సినిమాలో పూరీ జ‌గ‌న్నాథ్ పాత్ర ఏంటో తెలుసా?

Share

Puri Jagannadh: టాలీవుడ్ డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ న‌టుడుగా మార‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అది కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమాతో. ఈయ‌న హీరోగా ప్ర‌స్తుతం తెర‌కెక్కుతున్న చిత్రాల్లో `గాడ్ ఫాద‌ర్‌` ఒక‌టి. మలయాళ సూపర్ హిట్ మూవీ `లూసిఫర్`కు రీమేక్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తుండ‌గా.. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇందులో లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌, వ‌ర్సిటైల్ యాక్ట‌ర్ సత్య దేవ్‌, బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

అలాగే ఇందులో మ‌రో ముఖ్య పాత్ర‌లో పూరీ జ‌గ‌న్నాథ్ క‌నిపించ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని గ‌త వార‌మే చిత్ర టీమ్ క‌న్ఫార్మ్ చేసింది. అయితే ఈ చిత్రంలో పూరీ పాత్ర‌కు సంబంధించిన ఓ వార్త ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. అదేంటంటే.. గాడ్ ఫాద‌ర్‌లో ఆయ‌న జర్నలిస్ట్ పాత్రను చేస్తున్నాడట.

‘లూసిఫర్’ చిత్రంలో ఆ పాత్రను పృధ్విరాజ్ అన్న ఇంద్రజిత్ పోషించాడు. హీరో పాత్రను పరిచయం చేయడం, ఆ పాత్ర ఉద్దేశాన్ని తెలపడం, రాజకీయ వ్యవస్థలోని కొందరు అవినీతి పరుల గుట్టు ర‌ట్టు చేయ‌డం.. ఆ జర్నలిస్ట్ పని. అయితే ఆ పాత్ర‌లో పూరీ క‌నిపించ‌బోతున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాల్సి ఉంది. కాగా, పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్‌లో సాగే చిత్ర‌మిది. ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ ఈ మూవీ స్వ‌రాలు అందిస్తున్నారు.

 


Share

Related posts

Prabhas: అందుకే నాకింకా పెళ్లి కాలేదు.. ప్ర‌భాస్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

రామ్ పోతినేని డైరెక్టర్ కి జైలు శిక్ష..!!

sekhar

Manchu Manoj: పెళ్ళి కొడుకు కాబోతున్న మంచు మనోజ్…అమ్మయి ఎవరంటే??

Naina