MS Dhoni: భారత్ మాజీ క్రికెటర్ ఎమ్మెస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధోని కెప్టెన్ బాధ్యతలు చేపట్టాక భారత్ క్రికెట్ జట్టు అనేక ఫార్మేట్ లలో అంతర్జాతీయంగా పలు విజయాలు సొంతం చేసుకోవడం జరిగింది. 2011వ సంవత్సరంలో ప్రపంచకప్ కూడా గెలవడం తెలిసిందే. క్లిష్టమైన సమయంలో చాలా కూల్ గా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుని అనేక సందర్భాలలో… ఓడిపోయే మ్యాచ్ లను సైతం గెలిపించినా ట్రాక్ రికార్డు ధోని సొంతం. చాలా సందర్భాలలో టీంలో స్టార్ బ్యాట్స్ మెన్ లు… వరుసగా అవుట్ అయిన సమయంలో చివరి వరకు నిలబడి జట్టును గెలిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కూల్ కెప్టెన్ గా ప్రపంచ క్రికెట్ లవర్స్ చేత కీర్తించబడ్డ ధోని… అంతర్జాతీయ క్రికెట్ కీ రిటర్మెంట్ ప్రకటించాక ప్రస్తుతం ఐపిఎల్ మ్యాచ్ లు ఆడుతున్న సంగతి తెలిసిందే.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకీ నాయకత్వం వహించి అనేక మార్లు ఐపీఎల్ కప్ లు కూడా గెలవడం జరిగింది. ఈ క్రమంలో ఇప్పుడు సినిమా రంగంలో ధోని అడుగు పెట్టడం జరిగింది. పూర్తి విషయంలోకి వెళ్తే భార్య సాక్షితో కలిసి “ధోని ఎంటర్టైన్మెంట్” బ్యానర్ స్థాపించడం జరిగింది. ఈ బ్యానర్ పై అనేక సినిమాలు చేయడానికి ధోని ఇప్పటినుండే అనీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. దీనిలో భాగంగా చెన్నైలో తన బ్యానర్ లో తెరకకబోతున్న మొదటి సినిమా టైటిల్ ప్రకటించడం జరిగింది. “ఎల్జీఎం”(లవ్ గేట్స్ మ్యారీడ్) అనే క్రేజీ టైటిల్ ఖరారు చేశారు.

చెన్నైలో పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేసిన ఈ ప్రాజెక్టుకి ధోని భార్య సాక్షి క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించారు. కొత్త దర్శకుడు రమేష్ తమిళమణి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ధోని నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. “లవ్ టుడే” హీరోయిన్ ఇవానా నటిస్తున్న ఈ సినిమాలో “జెర్సీ” మూవీ నటుడు హరీష్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి మిగతా సాంకేతిక విభాగం ఇంకా పలు విషయాలు అధికారికంగా సినిమా యూనిట్ ప్రకటించనున్నట్లు సమాచారం.