Surya: తమిళ ఇండస్ట్రీ హీరో సూర్య అందరికీ సుపరిచితుడే. వెండితెరపై ఎటువంటి పాత్ర అయినా అలావోకగా చేస్తాడు. ముఖ్యంగా ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తూ ప్రతి సినిమాకి వేరియేషన్ లు చూపిస్తూ తనలో ఉన్న నటనను అద్భుతంగా వెండితెరపై పండించే సత్తా కలిగిన నటుడు సూర్య. డాన్స్ పరంగా ఇంకా ఫైట్స్ పరంగా కూడా ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాడు. దక్షిణాది సినిమా రంగంలో అన్ని ఇండస్ట్రీలలో సూర్యకి ఫ్యాన్స్ ఉన్నారు.
తెలుగులో శివపుత్రుడు, గజినీ సినిమాలతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గర అవటం జరిగింది. తమిళంలో ఉన్న అందరు హీరోల కంటే సూర్యకి తెలుగులో ఎక్కువ మార్కెట్ ఉంది. సూర్య ఎప్పటి నుండో తెలుగులో ఒక స్ట్రైట్ ఫిలిమ్ చేయాలని కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. హీరోగా ఇంక నిర్మాతగా కూడా తిరుగులేని ట్రాకర్ కాటు కలిగిన సూర్య సినిమా రంగంలో రాకముందు చేసిన పని గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయం బయట పెట్టడం జరిగింది. తాను సినిమాలో రాకముందు దుస్తులు తయారుచేసి ఎగుమతి చేసే దుకాణంలో పని చేసినట్లు తెలపడం జరిగింది.
అంతేకాదు రోజుకి 18 గంటలు పనిచేసినట్లు కూడా సూర్య తెలియజేశాడు. ఇందుకుగాను నెలకి ₹736 జీతం అప్పట్లో తీసుకున్నట్లు తెలిపాడు. ఇటీవలే హీరో సూర్య “ఆకాశమే నీ హద్దురా” సినిమాకు జాతీయ సినిమా అవార్డు అందుకోవటం జరిగింది. ఆయన నటించిన “ఆకాశమే నీ హద్దురా” సినిమాకు ఇటీవల ఐదు జాతీయ చలనచిత్ర అవార్డులు రావడం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సూర్య అవార్డు అందుకోవటం జరిగింది. ఈ అవార్డు ప్రధానానికి సూర్య భార్య జ్యోతిక కూడా రావటం విశేషం.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!