సినిమా

Ram Charan: చిరు-ఉపాస‌నల్లో చ‌ర‌ణ్ ఎవ‌రికి భ‌య‌ప‌డ‌తాడో తెలుసా?

Share

Ram Charan: మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ఆచార్య‌`. ఇందులో చిరు త‌న‌యుడు, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ `సిద్ధ‌` అనే కీల‌క పాత్ర‌ను పోషించారు. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే ఇందులో హీరోయిన్లుగా న‌టించ‌గా.. సోనూసూద్ విల‌న్‌గా చేశారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందించారు.

ఈ మ‌ధ్యే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన చిత్ర టీమ్‌.. నిన్న సాయంత్రం ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించారు. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి స్పెష‌ల్ గెస్ట్‌గా రాగా.. హైద‌రాబాదులోని యూసఫ్ గుడా పోలీస్ గ్రవుండ్స్ లో ఈ ఈవెంట్ అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది.

అయితే ఎంతో ఆహ్లాదకరంగా జ‌రిగిన ఈ ఈవెంట్ చివ‌ర్లో హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించిన సుమ‌.. చిరు, చ‌ర‌ణ్, కొర‌టాల శివ‌ల‌ను ప‌లు ఫ‌న్నీ ప్ర‌శ్న‌లు వేసింది. వాటికి చాలా తెలివిగా వారు ముగ్గురు స‌మాధానాలు ఇచ్చారు. ఇందులో భాగంగానే సుమ‌.. `ఇంట్లో నాన్న‌, భార్య ఉపాస‌న‌ల్లో ఎవరికి భయపడతారు..?` అని చ‌ర‌ణ్‌ను ప్ర‌శ్నించింది.

అందుకే ఆయ‌న బ‌దులిస్తూ.. `భ‌యం కాదు గానీ..మా నాన్న.. అమ్మ ముందు జాగ్రత్తగా ఉంటారు. నేను కూడా అదే నేర్చుకుని ఉపాసన ముందు కాస్త జాగ్రత్తగా ఉంటా. ` అంటూ స‌మాధానం ఇచ్చారు. ఇంత‌లోనే చిరు మైక్ అందుకుని `న‌న్ను చూసి నేర్చుకున్నావ్‌.. సుఖ‌ప‌డ‌తావ్‌, ఆడ‌వాళ్ల‌తో పెట్టుకోకూడ‌దు` అని చెబుతూ న‌వ్వులు పూయించారు. మొత్తానికి వీరి స‌ర‌దా సంభాష‌ణ మాత్రం నెట్టింట వైర‌ల్‌గా మారింది.


Share

Related posts

RamCharan Acharya : ఆచార్య నుండి ‘సిద్ధ’ వచ్చేసాడు.. రామ్ చరణ్ – చిరంజీవి సర్ ప్రైజ్ లుక్ అదరహో..

bharani jella

Shriya Saran New HD Stills

Gallery Desk

అనసూయ క్రేజ్ : ఒకే ఒక్క ఫోటో పెట్టింది .. సోషల్ మీడియా దద్దరిల్లిపోయింది !

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar