టాలీవుడ్ సినిమా రంగంలో గత రెండు సంవత్సరాల నుండి ఆగిపోయిన పెద్ద సినిమాలు ఈ ఏడాది ఫస్ట్ ఆఫ్ లో వరుస పెట్టి విడుదలయ్యాయి. కరోనా కారణంగా దాదాపు రెండు సంవత్సరాలు పాటు సినిమాలు మొత్తం విడుదల కాని పరిస్థితి గతంలో నెలకొంది. కానీ ఈ ఏడాది మార్చి నెల నుండి మొత్తం కేసులు తగ్గు ముఖం పట్టడం… బయట సాధారణ పరిస్థితి నెలకొనడంతో దాదాపు అరడజనుకు పైగానే పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. ఇదిలా ఉంటే గత కొన్నాల నుండి “ఓర్మక్స్ ఇండియా” సర్వే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఆయా ఇండస్ట్రీలకు సంబంధించి టాప్ హీరోలు మరియు హీరోయిన్ లు గురించి ఏ నెలకి ఆ నెల ర్యాంకింగ్స్ ప్రకటిస్తూ ఉంది. ఈ క్రమంలో తాజాగా జులై నెలకి సంబంధించి టాలీవుడ్ టాప్ పొజిషన్ లో నెంబర్ వన్ హీరో ఎన్టీఆర్ అని తెలియజేసింది. ఎన్టీఆర్ తర్వాత స్థానాలు ప్రభాస్, బన్నీ, రామ్ చరణ్, మహేష్, నాని, పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ, చిరంజీవి, రవితేజ. “RRR”కి గాను ఎన్టీఆర్ పేరు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో తారక్ నటనకు చాలామంది ఫిదా అయ్యారు.
మరి ముఖ్యంగా “RRR” ఓటిటి లలో రిలీజ్ అయ్యాక హాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ దర్శకులు… టెక్నీషియన్ లు తారక్ నటనపై ప్రశంసల వర్షం కురిపించడం తెలిసిందే. అంతేకాదు ఇటీవల అమెరికాకి చెందిన ఓ ప్రముఖ మ్యాగజైన్ ఎన్టీఆర్ ఆస్కార్ రేసులో ఉన్నట్లు వార్తలు ప్రచురించడం జరిగింది. “RRR”తో ఒక రకంగా తారక్ పేరు గత కొద్ది నెలలుగా ప్రపంచవ్యాప్తంగా మారింది. దీంతో “ఓర్మక్స్ ఇండియా” సంస్థ జులై నెలలో నిర్వహించిన సర్వేలో తారక్ మొదటి స్థానం లభించినట్లు తెలుస్తోంది. ఇక హీరోయిన్ లిస్టు చూస్తే మొదటి స్థానంలో సమంత తర్వాతి స్థానాలలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే, సాయి పల్లవి, కీర్తి సురేష్, తమన్నా, రష్మిక మందన, కృతి శెట్టి, రాసి కన్నా.. నిలవడం జరిగింది.