SVP: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు పరుశురామ్ పెట్ల కాంబినేషన్ లో వస్తున్న మాస్ అండ్ యాక్షన్ డ్రామా ‘సర్కారు వారి పాట’. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మళ్లీ సర్కారు వారి పాటతో మహేష్ థియేటర్లలో సందడి చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ మే 2న రిలీజ్ అయ్యింది. అయితే ట్రైలర్ లో మహేశ్ ఊరమాస్ గా కనిపిస్తున్నారు. పోకిరి, దూకుడు తర్వాత మహేష్ బాబు ఫుల్ మాస్ వైబ్స్ తో నటిస్తున్న చిత్రం ఇదే. దీనితో సర్కారు వారి పాటపై మంచి అంచనాలు ఉన్నాయి. మహేష్ బాబు ట్రైలర్ లో డైలాగ్స్, కామెడీ టైమింగ్, యాక్షన్ తో అదరగొట్టేస్తున్నాడు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
SVP: ట్రైలర్ లో మరో నటి హైలెట్..
ట్రైలర్ య్యూటూబ్ లో విడుదలైన గంటలోపే 10 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకొని ఫాస్టెస్ట్ వ్యూస్ సాధించిన ట్రైలర్ గా రికార్డు క్రియేట్ అయ్యింది. మరోవైపు ఇంకా 24 గంటలు పూర్తవ్వక ముందే దాదాపు 25 మిలియన్ల వ్యూస్ ను తక్కువ సమయంలో దక్కించుకుంది. కాగా.. ఇదే ట్రైలర్ లో కనిపించిన ఓ నటి గురించి కూడా ఇప్పుడు మూవీ లవర్స్ చర్చించుకుంటున్నారు. ట్రైలర్ లో కీర్తి సురేష్ తో పాటు మరో నటి కూడా హైలెట్ అవుతుంది. ట్రైలర్ లో రెండు మూడు సార్లు కనిపించిన ఈ నటి ఎవరా అని అప్పుడే ఇంటర్నెట్ లో వెతకడం కూడా మొదలెట్టారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కుర్రకారు మనసు దోచుకున్న సౌమ్య మీనన్..
సర్కారు వారి పాత ట్రైలర్ లో కనిపించిన ఈ నటి పేరు సౌమ్య మీనన్. చూసేందుకు కొంచెం నిధి అగర్వాల్ పోలికలతో ఉన్న సౌమ్య మీనన్ మలయాళ నటి. మలయాళంలో దాదాపు 6 సినిమాలలో నటించిన సౌమ్య… కన్నడలో హంటర్ అనే సినిమాలో నటించగా.. తెలుగులో కూడా టాక్సీ అనే సినిమాలో నటించింది. సౌమ్య నటి మాత్రమే కాదు మంచి డాన్సర్ కూడా. మలయాళంలో కొన్ని మ్యూజిక్ వీడియోలతో కూడా సందడి చేసింది. ట్రైలర్ లో కనపడి కుర్రకారు మనసు దోచుకుందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!