సినిమా

Unstoppable Show: `అన్ స్టాపబుల్`కు హోస్ట్‌గా బాల‌య్య కంటే ముందు ఎవ‌ర్ని సంప్ర‌దించారో తెలుసా?

Share

Unstoppable Show: న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ తొలిసారి హోస్ట్‌గా మారి చేస్తున్న షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే`. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ `ఆహా`లో ప్ర‌సారం అవుతున్న ఈ షో.. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అన్ని టాక్ షోస్‌ను వెన‌క్కి నెట్టి నెంబ‌ర్.1 స్థానాన్ని సంపాదించుకుంది. అందుకు కార‌ణం బాల‌య్యే. త‌నదైన హోస్టింగ్‌తో ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తూ.. వ‌చ్చిన గెస్ట్‌ల ద‌గ్గ‌ర నుంచి స్మార్ట్‌గా, స్మూత్‌గా రాబ‌ట్టాల్సిన స‌మాచారం మొత్తాన్ని రాబ‌ట్టేస్తున్నారు.

ఇప్ప‌టికే ఈ షోలో మోహ‌న్ బాబు, నాని, బ్ర‌హ్మానందం, అనిల్ రావిపూడి, రవితేజ‌, రానా ద‌గ్గుబాటి, బోయ‌పాటి శ్రీ‌ను, రాజ‌మౌళి, ఎమ్‌.ఎమ్‌.కీర‌వాణి, గోపీచంద్ మ‌లినేని త‌దిత‌రులు పాల్గొన్నారు. ఇక‌పోతే ఈ షోకు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. అన్ స్టాప‌బుల్‌కి మొద‌ట హోస్ట్‌గా బాల‌య్య‌ను అనుకోలేద‌ట‌.

బాల‌య్య కంటే ముందే టాలీవుడ్‌కు చెందిన ఓ ఇద్ద‌రు హీరోల‌ను ఆహా టీమ్ హోస్ట్‌గా చేయాల‌ని సంప్ర‌దించార‌ట‌. ఇంత‌కీ ఆ హీరోలు ఎవ‌రో కాదు.. విక్ట‌రీ వెంక‌టేష్‌, న్యాచుర‌ల్ స్టార్ నాని. అన్ స్టాపబుల్ షో కాన్సెప్ట్‌ను ఫ‌స్ట్ వెంకీ వ‌ద్ద‌కు తీసుకెళ్ల‌గా.. ఆయ‌న క‌రోనా కార‌ణంగా రిస్క్ తీసుకోలేక నో చెప్పార‌ట‌. ఆ త‌ర్వాత నానిని సంప్ర‌దించ‌గా.. వ‌రుస సినిమాల‌ను ఒప్పుకోవ‌డం వ‌ల్ల ఆయ‌న సైతం ఈ ఆఫ‌ర్‌ను సున్నితంగా రిజెక్ట్ చేశార‌ట‌.

ఇక త‌ర్వాతే అల్లు అర‌వింద్ బాల‌య్య‌ను ఆడిగార‌ని.. షో కాన్సెప్ట్ న‌చ్చ‌డంతో ఆయ‌న వెంట‌నే ఓకే చెప్పార‌ని అంటున్నారు. ఏదేమైన‌ప్ప‌టికీ వెంకీ, నానిలు ఈ షోను రిజెక్ట్ చేయ‌డం బాల‌య్య ఎంతో ప్ల‌స్ అయింది. ఎందుకంటే, ఈ షో ద్వారానే బాల‌య్య త‌న‌లోని మ‌రో కోణాన్ని రుచి చూపించి తెలుగు వారికి మ‌రింత చేర‌వ‌య్యాడు.


Share

Related posts

108 ప్రీ-రిలీజ్‌కు వారు

Siva Prasad

ఆర్జీవి కార్యాలయంపై దాడి కేసులో కొత్త ట్విస్ట్…!!

sekhar

Chiranjeevi: సుక్కూ డైరెక్షన్‌లో మెగాస్టార్..ఎంజాయ్ చేశానంటూ ట్వీట్..

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar