31.2 C
Hyderabad
March 23, 2023
NewsOrbit
Entertainment News సినిమా

NTR Charan: చరణ్ తో పాటు అమెరికాకి వెళ్లాల్సిన ఎన్టీఆర్ ఎందుకు ఆగిపోయాడో తెలుసా..?

Share

NTR Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం అమెరికా టూర్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల గుడ్ మార్నింగ్ అమెరికా అనే షోలో పాల్గొనడం జరిగింది. ఇప్పటివరకు ఈ షోలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన ఏ హీరో కూడా పాల్గొలేదు. ఈ షోలో తన వ్యక్తిగత విషయాలతో పాటు “RRR”… రాజమౌళి గురించి ఇంకా ఎన్టీఆర్ గురించి అనేక విషయాలు తెలియజేయడం జరిగింది. తాను తండ్రి అయిన విషయాన్ని సోషల్ మీడియాలో చెప్పక ముందే మొట్టమొదటిగా ఎన్టీఆర్ కి చెప్పడం జరిగిందని అంతగా అతనితో స్నేహం ఉందని చరణ్ చెప్పారు.

Do you know why NTR, who was supposed to go to America with Charan, stopped

ఇదిలా ఉంటే అసలు ఈ షోకి చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా రావాల్సింది అంట. కానీ చివరి నిమిషంలో అమెరికా టూర్ తారక్ క్యాన్సిల్ చేసుకున్నాడట. మేటర్ లోకి వెళ్తే నందమూరి తారకరత్న మరణించడంతో అతని అంత్యక్రియలు.. ఇంకా పలు కార్యక్రమాలు ఉండటంతో తారక్ అమెరికా టూర్ క్యాన్సిల్ చేసుకోవడం జరిగిందంట. 39 సంవత్సరాల వయసులోనే నందమూరి తారకరత్న మరణించడంతో.. కుటుంబంలో విషాదం నెలకొంది. చాలామంది సెలబ్రిటీలు రాజకీయ నేతలు.. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తారకరత్న అతి చిన్న వయసులో గుండెపోటుతో మరణించడం.. అందరికీ షాక్ గురి చేసింది. నందమూరి కుటుంబ సభ్యులు ఎంతో బాధపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ తారకరత్న అంత్యక్రియలలో పాల్గొనడం జరిగింది.

Do you know why NTR, who was supposed to go to America with Charan, stopped

ఇదిలావుండగా వాస్తవానికి చరణ్ తో కలిసి తారక్ కూడా అమెరికాలో పలు షోలలో పాల్గొనాలి. కానీ అన్న తారకరత్న మరణించడంతో.. అమెరికా టూర్ కార్యక్రమం మొత్తానికి పక్కన పెట్టేసాడంట. ఇదిలా ఉంటే ఓ షోలో హాలీవుడ్ ఇండస్ట్రీలో పనిచేయాలని ఉందని చరణ్ మనసులో మాట బయటపెట్టారు. తనకి ఇష్టమైన చాలా మంది డైరెక్టర్ లు హాలీవుడ్ లో ఉన్నారని చెప్పుకొచ్చారు. అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తానని స్పష్టం చేశారు. ఇంకా ఆస్కార్ వస్తే ఆనందానికి అవధులు ఉండవని.. చరణ్ తెలియజేయడం జరిగింది.


Share

Related posts

Anilravipudi: “F4” గురించి కొత్త విషయం చెప్పిన అనిల్ రావిపూడి..!!

sekhar

`థ్యాంక్యూ` 3 డేస్ క‌లెక్ష‌న్స్‌.. ఇక చైతూను ఎవ‌రూ కాపాడ‌లేరు!

kavya N

మెగాస్టార్ చిరంజీవితో దోశ చేయించిన సమంత.. వీడియో వైరల్

Varun G