Mahesh: ఫుల్ డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్న మహేశ్ ఫ్యాన్స్‌కు డబుల్ ఎనర్జీ వచ్చే అప్‌డేట్ ఇదే

Share

Mahesh: సూపర్ స్టార్ మహేశ్ బాబు గత నాలుగైదేళ్ళుగా పెద్ద గ్యాప్ లేకుండానే వరుసగా సినిమాలను చేస్తూ అభిమానులకు బ్లాక్ బస్టర్స్ ఇస్తూ వచ్చారు. గత చిత్రం సరిలేరు నీకెవ్వరు సినిమాతోనూ బ్లాక్ బస్టర్ కా బాప్ అని చెప్పుకునే మాస్ హిట్ ఇచ్చారు. దీని తర్వాత పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట చిత్రాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అంతక ముందు సినిమాలకు బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్స్ ఇచ్చిన మహేశ్ ..సర్కారు వారి పాట సినిమా విషయంలోనూ అలాగే అప్‌డేట్స్ ఇచ్చారు.

double energy update for mahesh-fans
double energy update for mahesh-fans

అయితే కరోనా కారణంగా రెండుసార్లు ఈ సినిమా వాయిదా పడి ఫైనల్‌గా ఈ ఏడాది ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ విదేశాలతో పాటు హైదరాబాద్‌లోనూ జరిగింది. దాదాపు ఫైనల్ స్టేజ్‌కు చేరుకున్న తర్వాత మహేశ్‌కు అత్యవసర పరిస్థితుల్లో మోకాలికి సర్జరీ చేయాల్సి వచ్చి షూటింగ్‌కు రెండు నెలలు బ్రేక్ ఇచ్చారు. ఆపరేషన్ తర్వాత మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టాలనుకున్న సమయంలో కరోనా బారిన పడ్డారు. అయినా కూడా మహేశ్ లేకుండా వైజాగ్‌లో కొంత షూటింగ్ జరుపుతున్నారు.

Mahesh: ఫస్ట్ సింగిల్‌ను జనవరి 26న..

ఇక కొత్త సంవత్సరం సంక్రాంతి కానుకగా సర్కారు వారి పాట సినిమా నుంచి అప్‌డేట్స్ వస్తాయనుకున్నారు అభిమానులు. ఇంతలో మహేశ్ అన్న రమేశ్ బాబు మృతితో అన్నీ ప్లాన్స్ డిస్ట్రబ్ అయ్యాయి. దాంతో మ్యూజికల్ ట్రీట్ ఇవ్వాలనుకున్న మేకర్స్ సైలెంట్ అయ్యారు. దాంతో ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్ అయ్యారు. అయితే ఈ నెల 26న మ్యూజికల్ ఫీస్ట్‌ను మొదలు పెట్టి వరుసగా ఒక్కో సింగిల్‌ను రిలీజ్ చేయాలని సర్కారు వారి పాట బృందం ప్లాన్ చేస్తున్నారట. ఫస్ట్ సింగిల్‌ను జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా వదలబోతున్నట్టు తాజా సమాచారం. కాగా థమన్ సంగితం అందిస్తున్న ఈ సినిమాను మహేశ్ బాబు..14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు.


Share

Related posts

మీ ఫేవరేట్ స్టార్‌ని మరింత ద‌గ్గ‌ర చేసే `ఫీట్ అప్ విత్ ద స్టార్స్‌`: మంచు లక్ష్మి

Siva Prasad

బాబు మాటలు పెడచెవిన పెట్టిన తెలుగు తమ్ముళ్ళు ! ఏ విషయంలో??

Yandamuri

AIRSTRIKE: టిగ్రే మార్కెట్‌పై వైమానిక దాడి..! 80మందికిపైగా మృతి..!!

somaraju sharma