NewsOrbit
Entertainment News సినిమా

RC 15: చరణ్ బర్త్ డే నాడు అభిమానులకు డబల్ ట్రీట్..!!

Share

RC 15: మార్చి 27వ తారీకు చరణ్ బర్తడే నేపథ్యంలో అభిమానులు భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. “RRR” సినిమాతో చెర్రీ గ్లోబల్ స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో భార్య ఉపాసన గర్భవతి. ఎప్పటినుండో పిల్లల కోసం ఎదురు చూస్తున్న క్షణాలివి. అన్ని రకాలుగా చూసుకున్న చరణ్ ఫుల్ సంతోషంగా ఉన్నారు. హాలీవుడ్ ఇండస్ట్రీ నుండి కూడా సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. కెరియర్ పరంగా చరణ్ మంచి పీక్ స్టేజ్ లో ఉన్నారని చెప్పవచ్చు. దీంతో గత మూడు రోజుల నుండి చరణ్ జన్మదిన వేడుకలు రకరకాలుగా అభిమానులు నిర్వహిస్తున్నారు.

Double treat for fans on Charan's birthday

పరిస్థితి ఇలా ఉంటే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. RC 15 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటుంది. పాన్ ఇండియన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి చరణ్ బర్త్డే నాడు మార్చి 27 ఉదయం 8:19 నిమిషాలకు, మధ్యాహ్నం మూడు గంటల ఆరు నిమిషాలకు…రెండు అప్ డేట్ లు ఇవ్వనున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించడం జరిగింది.

Double treat for fans on Charan's birthday

మొదట టైటిల్ తర్వాత ఫస్ట్ పోస్టర్ తో చరణ్ బర్తడే నాడు ఫ్యాన్స్ కి డబల్ ట్రీట్ ఇవ్వబోతున్నారట. ఈ సినిమాలో ఎస్ జె సూర్య నెగటివ్ పాత్రలో కనిపిస్తున్నారు. దాదాపు మూడు విభిన్నమైన పాత్రలలో చరణ్ ని ఇప్పటివరకు ఏ డైరెక్టర్ చూపించని రీతిలో శంకర్ చూపించబోతున్నట్లు సమాచారం. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.


Share

Related posts

Nagarjuna: నాగార్జున చేతి లోకి వచ్చినట్లు వచ్చి మిస్ అయిన సినిమాల లిస్టు..!!

sekhar

Rashmi Gautam Gorgeous Pics

Gallery Desk

RRR: ఛాన్స్ దొరికితే వారిద్దరితో మల్టీస్టారర్ సినిమా చేస్తా రాజమౌళి వైరల్ కామెంట్స్..!!

sekhar