నాలుగేళ్ల క్రితం వచ్చిన డ్రీమ్ గర్ల్ సినిమా బాలీవుడ్‌లో రికార్డులు సృష్టించింది. కేవలం రూ.28 కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా ఫైనల్ రన్‌లో రూ.150 కోట్లు వసూళ్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపర్చింది. అదే సక్సెస్ ఫార్ములాతో ఆయుష్మాన్ డ్రీమ్ గర్ల్-2తో వచ్చాడు. ఫస్ట్ పార్ట్‌కు తెరకెక్కించిన రాజ్ శండియానే సెకండ్ పార్ట్‌కు కూడా దర్శకత్వం వహించాడు. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. అయితే సినిమా ఎలా ఉంది? సినిమా స్టోరీ ఏంటీ? ఫస్ట్ డే కలెక్షన్ ఎంత? తదితర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

సినిమా పేరు: డ్రీమ్ గర్ల్-2
నటీనటులు: ఆయుష్మాన్ ఖురానా, అనన్య పాండే, పరేష్ రవల్, అన్ను కపూర్, విజయ్ రాజ్, రాజ్‌పాల్ యాదవ్, అస్రాణి, మనోజ్ జోషి
దర్శకత్వం: రాజ్ శండియా
నిర్మాతలు:ఎక్తా కపూర్, శోభా కపూర్
సంగీతం: హితేష్ సోనిక్
సినిమాటోగ్రఫి: సీకే మురళీధర్
ఎడిటర్: హేమల్ కొఠారీ
విడుదల తేదీ: 25 ఆగస్టు 2023

సినిమా స్టోరీ..
మథురా అనే చిన్న పట్టణంలో కరమ్ (ఆయుష్మాన్ ఖురానా) యువకుడు నివసిస్తుంటాడు. తన తండ్రి చేసిన అప్పులను తీర్చేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటాడు. ఒకరి దగ్గర అప్పులు తీసుకుని మరొకరికి అప్పులు క్లియర్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే కరమ్‌కు పరి (అనన్య పాండే) అమ్మాయి పరిచయం అవుతుంది. వీరిద్దరూ ప్రేమలో పడతారు. అయితే పరి తన ఇంట్లో కరమ్‌ను ప్రేమిస్తున్న విషయాన్ని చెబుతుంది. దాంతో పరి తండ్రి కరమ్‌కు కొన్ని కండీషన్లు పెడతాడు. మంచి ఉద్యోగం, అకౌంట్ రూ.25 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని, అప్పుడే తన కూతురితో పెళ్లి చేయిస్తానని, ఆరు నెలలు గడువు ఇచ్చి వెళ్లిపోతాడు. ఓ వైపు తండ్రి అప్పులు, మరో వైపు పరి తండ్రి ఇచ్చిన గడువుతో ఏం చేయాలో కన్ఫ్యూజన్‌లో కరమ్ ఉంటాడు. తన తండ్రి, స్నేహితుడు స్మెలీ (మనోజ్ సింగ్) సలహా మేరకు పూజా(ఆయుష్మాన్)గా అవతారమెత్తుతాడు.
తక్కువ సమయంలో డబ్బులు సంపాదించడం కోసం బార్‌లో డ్యాన్సర్‌గా చేరుతాడు. అక్కడ వచ్చిన డబ్బులు కూడా సరిపోవు. ఈ క్రమంలో డిప్రెషన్‌లో ఉన్న షారుఖ్ (అభిషేక్ బెనర్జీ) పూజ ప్రేమలో పడతాడు. అయితే షారుఖ్ పట్టణంలో పెద్ద ధనవంతుడు. షారుఖ్ తాత పూజను పెళ్లికి ఒప్పిస్తాడు. డబ్బు కోసం పెళ్లి చేసుకున్న ఆయుష్మాన్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు? బార్ ఓనర్ సోనా భయ్యా (విజయ్ రాజ్), బ్యాంక్ మేనేజర్ (రంజన్ రాజ్)లు కూడా పూజను పెళ్లి చేసుకోవాలని వెంట పడుతుంటారు.? వాళ్ల నుంచి ఆయుష్మాన్ (పూజ) ఎలా తప్పించుకుంటాడు? పరితో కరమ్ పెళ్లి చేసుకుంటాడా? తాను ఎదుర్కొనే కష్టాలను చూపిస్తూ.. అందులోనే ఫన్ క్రియేట్ చేశారు డైరెక్టర్ రాజ్ శండియా.

సినిమా ఎలా ఉంది..
డ్రీమ్ గర్ల్-2 ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్‌గా చెప్పవచ్చు. సినిమా మొత్తం ఆయుష్మాన్ చుట్టూ తిరుగుతుంది. లేడీ గెటప్‌లో ఆయుష్మాన్ యాక్టింగ్ ఇరగదీశాడు. సినిమాకు ఆయుష్మాన్ నటన ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ మొత్తం నవ్వుతూ సాగుతుంది. సెకంఢాప్‌లో కామెడీ ఉన్నప్పటికీ చివర్లో కొంచెం డల్ అయినట్లు అనిపిస్తుంది. అనన్య పాండే యాక్టింగ్ అంతగా ఆకట్టుకోలేదు. సినిమాలో ఆమె రోల్ కూడా తక్కువే ఉంటుంది. మిగిలిన యాక్టర్లు తమ తమ పాత్రకు న్యాయం చేశారు. సినిమా మొత్తాన్ని ఆయుష్మాన్ తన భుజాన పెట్టుకున్నాడని చెప్పుకోవచ్చు. వన్ మ్యాన్ షో. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. కడుపుబ్బా నవ్వాలనుకునే వారు, టెన్షన్ల నుంచి రిలీఫ్ అవ్వాలనుకునే వారు ఈ సినిమాకు వెళ్తే ఫుల్‌గా ఎంటర్‌టైన్ అవుతారు.

ఫస్ట్ డే కలెక్షన్..
శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసింది. పాజిటివ్ టాక్‌తో ముందుకు దూసుకెళ్తోంది. ఫుల్ ఆఫ్ ఎంటర్‌టైనర్ కావడంతో ఈ సినిమా చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. రూ.కోట్లల్లో వసూళ్లు రాబట్టింది. డ్రీమ్ గర్ల్-2 ఫస్ట్ డే కలెక్షన్ రూ.9.70 కోట్లు వసూళ్లు చేసింది. ఇంకా ఇదే దూకుడు ప్రదర్శిస్తోంది.
న్యూస్ ఆర్బిట్ రేటింగ్: 3/5
గమనిక: ఈ సమీక్ష సమీక్షుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.