పాన్ ఇండియా హీరోగా “బాహుబలి” సినిమాతో దేశవ్యాప్తంగా తో పాటు అంతర్జాతీయ స్థాయిలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతున్న నేపథ్యంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ని కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులు ప్రభాస్ కి బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పూర్తి మేటర్ లోకి వెళ్తే సుశాంత్ సింగ్ కేసులో డ్రక్స్ కోణం అదేవిధంగా శాండిల్ వుడ్ లో బయటపడ్డ డ్రగ్స్ కోణంలో ప్రభాస్ తో నటించిన హీరోయిన్ల పేర్లు రావటంతో సంబంధిత మీడియా ఛానల్స్ ప్రభాస్ హీరోయిన్లు అంటూ వార్తలు వైరల్ చేయడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ బాధపడిపోతూ ఉన్నారట. ముఖ్యంగా బాలీవుడ్ డ్రగ్ ఎపిసోడ్ లో దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్ ల పేర్లు బయట పడటంతో ప్రభాస్ హీరోయిన్లు అంటూ బాలీవుడ్ మీడియా వార్తలు తెగ వడ్డీ వారస్తుందట.
అదే విధంగా శాండిల్ వుడ్ లో హీరోయిన్ సంజనా పేరు బయటకు రావడంతో బెంగళూరు మీడియా బాహుబలి హీరోయిన్ అంటూ వార్తలు వైరల్ చేసింది. ఇదే కేసుని తెలుగు మీడియా “బుజ్జిగాడు” హీరోయిన్ అంటూ ఈ డ్రగ్స్ కేసులో ప్రభాస్ పేరును బాగా వైరల్ చేయటంతో… దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు తెగ ఫీల్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!