Balakrishna: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్. గత ఏడాది “అలా వైకుంఠపురం లో” సినిమా కి ఇచ్చిన సాంగ్స్ సోషల్ మీడియాలో సౌత్ ఇండస్ట్రీ లో ఏ సినిమా క్రియేట్ చెయ్యని రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. ఈ దెబ్బతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” సినిమా నుండి ఇండస్ట్రీ లో ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చాలా సినిమాలకు తమన్ మ్యూజిక్ అందిస్తూ ఉన్నాడు.
బాలయ్య బాబు “అఖండ”, మహేష్ బాబు “సర్కారు వారి పాట”, రాణా… పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ సినిమా ఇంకా చాలా సినిమాలకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటువంటి తరుణంలో దేవిశ్రీప్రసాద్ జోరు తగ్గింది అన్న వార్తలు వస్తున్న సమయంలో నట సింహం బాలకృష్ణ సినిమా కి మరోసారి సంగీతం అందించడానికి దేవి శ్రీ ప్రసాద్ రెడీ అయినట్లు సమాచారం. విషయంలోకి వెళితే గతంలో బోయపాటి దర్శకత్వంలో బాలయ్య నటించిన “లెజెండ్” సినిమాకు డీఎస్పీ సంగీతం అందించడం తెలిసిందే.
Read More: దేవీని టార్గెట్ చేసిన తమన్?
ఆ సినిమా స్టోరీ పరంగా మాత్రమే కాక సాంగ్స్ పరంగా మ్యూజిక్ పరంగా కూడా సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం నందమూరి బాలయ్య బాబు “అఖండ” సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం లో సినిమా ఓకే చేయటం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా డీఎస్పీ ని సెలెక్ట్ చేయడం జరిగిందట. అనిల్ రావిపూడి అంతకుముందు సినిమా సరిలేరు నీకెవ్వరు, F3 కి కూడా డీఎస్పీ మ్యూజిక్ అందించడం జరిగింది. ఇప్పుడు మరోసారి బాలకృష్ణ సినిమాకు డిఎస్పి ని సెలెక్ట్ చేయడం జరిగిందట.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!