ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా రంగం స్థాయి పెరిగిన సంగతి తెలిసిందే. రాజమౌళి పుణ్యమా తెలుగు సినిమాలకి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఏర్పడింది. అంతేకాదు తెలుగు దర్శకులతో ఇతర ఇండస్ట్రీలకు చెందిన వాళ్లు పనిచేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. బాలీవుడ్ మొదలుకొని దక్షిణాదిలో పలు ఇండస్ట్రీలకు చెందిన హీరోలు టాలీవుడ్ దర్శకులతో పనిచేయడానికి క్యూ కట్టే పరిస్థితి నెలకొంది. పరిస్థితి ఎలా ఉంటే ఏకంగా ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు మార్కెట్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది.
ఇటీవల అనురాగవపూడి దర్శకత్వంలో డైరెక్ట్ తెలుగు సినిమా “సీతారామం” అనే అద్భుత ప్రేమ కావ్యం సినిమా చేయడం తెలిసిందే. ఆగస్టు 5వ తారీఖు విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో నటించడం జరిగింది. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరి అయిపోయాడు. ఇటువంటి మంచి సమయంలో దుల్కర్ సల్మాన్ మరో తెలుగు కూల్ డైరెక్టర్ తో పని చేయడానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.
మేటర్ లోకి వెళ్తే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అద్భుతమైన లవ్ స్టోరీ సినిమాకి దుల్కర్ సల్మాన్ ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. కొద్దిగా మార్పులు చేర్పులు దుల్కర్ సూచించినట్లు ప్రస్తుతం చర్చల దశలో ఈ ప్రాజెక్టు ఉన్నట్లు .. అంతా ఓకే అయితే త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. శేఖర్ కమ్ముల ఆల్ రెడీ ధనుష్ తో సినిమా చేయడానికి రెడీ కావడం తెలిసిందే. అయితే ప్రస్తుతం ధనుష్ సినిమా ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో దుల్కర్ సల్మాన్ .. ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!