Vir Das: ప్రముఖ స్టాండప్ కమెడియన్ వీర్ దాస్ అందరికీ సుపరిచితుడే. 2021లో అమెరికాలో ” టూ ఇండియాస్” పేరుతో ఓ ప్రదర్శన ఇచ్చాడు. ఆ సమయంలో భారతదేశ పరువు తీసేలా వీర్ దాస్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. పగలు మహిళలను పూజిస్తూ రాత్రి లైంగిక దాడులకు పాల్పడే దేశం నుంచి వచ్చానంటూ… తనని తాను పరిచయం చేసుకునే సమయంలో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. వీర్ దాస్ కామెంట్స్ దేశవ్యాప్తంగా అగ్గి రాజేశాయి. ఆ సమయంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు మరియు సెలబ్రిటీలు తమ రాష్ట్రాలలో వీర్ దాస్ ప్రదర్శనలను అనుమతించమని తెలియజేశారు. పుట్టిన దేశాన్ని ఎగతాళి చేసే వారిని జోకర్లుగా భావిస్తామని అన్నారు. దేశాన్ని కించపరుస్తూ వీర్ దాస్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. అటువంటి ఈ స్టాండప్ కమెడియన్..తాజాగా 2023 ఏమ్మీ అంతర్జాతీయ అవార్డు గెలుచుకోవడం జరిగింది.
విషయంలోకి వెళ్తే నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అయిన “వీర్ దాస్: ల్యాండింగ్” కామెడీ సీరీస్ కు గాను ఈ అవార్డు దక్కింది. 2021 నుండి ఈ అవార్డుకి వీర్ దాస్.. రెండుసార్లు నామినేట్.. అయితే ఈసారి విజయం వరించింది. ప్రస్తుతం అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుల వేడుక… న్యూయార్క్ నగరంలో జరుగుతుంది. ఇందులో 20 దేశాల నుంచి 14 విభాగాలలో నామినీలు ఉన్నారు. ఈ సందర్భంగా నెట్ ఫ్లిక్స్ విడుదల చేసిన ఓ ప్రకటనలో వీర్ దాస్.. తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ మధురమైన క్షణాలు నిజంగా నమ్మశక్యంగా లేదు. ఇది అసలు ఓ కలల భావించే ఒక అద్భుతమైన గౌరవంగా స్వీకరిస్తున్నాను.
కామెడీ కేటగిరిలో “వీర్ దాస్” ల్యాండింగ్” కి ఏమ్మీ అవార్డు దక్కటం ఒక మైలురాయి మాత్రమే కాదు దేశానికి గర్వకారణంగా.. భావిస్తున్న. “వీర్ దాస్: ల్యాండింగ్” తో ప్రపంచవ్యాప్తంగా భారత్ పేరు మారుమరుగటం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నెట్ ఫ్లిక్స్, ఆకాష్ వర్మ, రెగ్ టైగర్ మాన్ లకు ధన్యవాదాలు. స్థానిక కథలను రూపొందించడం నుంచి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకోవటం వరకు నా ఈ ప్రయాణం రెండు సవాలుగా ఉన్నాయి. నోయిడా నుంచి అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు వరకు నేను చేరుకోవటం ఎంతో సంతోషానీ కలిగించింది” అని వీర్ దాస్ తన ఆనందాన్ని పంచుకున్నారు. కాగా ఏమ్మీ అవార్డు గెలుచుకున్న మొదటి ఇండియన్ కమెడియన్ గా వీర్ దాస్ రికార్డు సృష్టించారు.