యంగ్ బ్యాచిలర్ హీరోలు.. పలానా అమ్మాయితో క్లోజ్ ఉన్నారు.. డేటింగ్ ఉన్నారనో.. ఇప్పుడో అప్పుడో పెళ్లి చేసుకుంటారనే వార్తల్లో ఎప్పుడూ నిలుస్తుంటారు. విశాల్ కూడా ఇన్ని వార్తలతో సమయం గడిపిన వాడే.ముఖ్యంగా విశాల్, తన చిన్ననాటి స్నేహితురాలు, హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్‌ని పెళ్లి చేసుకుంటాడని చాలా వార్తలే వినిపించాయి కూడా. వాటిని అటూ వరలక్ష్మి, ఇటు విశాల్ ఖండిస్తూ వచ్చిన వార్తలకు ఎక్కడా బ్రేక్ పడలేదు. అయితే ఈ వార్తలకు ఫుల్స్టాప్ పెట్టేస్తూ కొన్ని రోజుల ముందు హైదరాబాద్‌కు చెందిన అనీషా రెడ్డి అల్ల అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించేశాడు. లెటెస్ట్ సమాచారం ప్రకారం విశాల్, అనీషా రెడ్డిల నిశ్చితార్థాన్ని ఈ నెల 16న హైదరాబాద్‌లో పరిమిత సంఖ్యలో బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో నిర్వహించబోతున్నారు. అదే రోజున పెళ్లి డేట్‌పై కూడా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి విశాల్ పెళ్లి చెన్నైలో నడిగర్ సంఘం భవనంలో చేసుకుంటాడా? లేక హైదరాబాద్‌లో చేసుకుంటాడా? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే..
previous post
next post