Ester Noronha:ఎస్తర్.. టాలీవుడ్లో కొన్ని సినిమాల్లో నటించిన తరువాత సింగర్ నోయల్ తో పెళ్లి అనంతరం కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ తర్వాత కొన్ని అనూహ్య కారణాల వల్ల వీరు విడాకులు తీసుకోవడం జరిగింది. ఆ తరువాత ఆమె మళ్ళీ ఇన్నాళ్లకు ’69 సంస్కార్ కాలనీ’ అనే ఈ సినిమాతో మరలా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. మార్చి 18వ తారీఖున ఈ సినిమా థియేటర్లు ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఈవిడ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారాన్ని రేపుతున్నాయి.
Kangana Ranaut: ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాపైన కంగనా అభ్రిప్రాయం… బాలీవుడ్ చేసిన పాపాలు కడిగేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు!
Ester Noronha:ఎస్తర్ ఘాటు వ్యాఖ్యలు:
ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాపై కొందరు విమర్శలు చేస్తున్నారు. ఆ ట్రోల్స్ ని దృష్టిలో పెట్టుకొని హీరోయిన్ ఎస్తర్ రిలీజ్ ప్రెస్ మీట్ సందర్భంగా మాట్లాడుతూ.. మగ వారికి మాత్రమే కాదు, ఆడ వారికి కూడా కోరికలు ఉంటాయి! అనే విషయం ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర ద్వారా చూపించే ప్రయత్నం చేశాము అని అన్నారు. అక్కడితో ఆగకుండా సినిమాలో ఆ పాత్రలో నటించిన హీరోయిన్ మాత్రమే కాకుండా హీరోయిన్ తో కనిపించిన కుర్రాడు కూడా తప్పు చేశాడు కదా. అతడిని అలా ప్రశ్నించరు ఎందుకని ఎదురు ప్రశ్న వేశారు మీడియాకి!
Vijay Deverakonda: టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిన విజయ్ దేవరకొండ డైరెక్టర్ ల లైన్ ఆప్..??
విజ్ఞత లేదా అంటూ మండిపాటు?
ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియాపైన విరుచుకు పడ్డారు. మగవారు ఆడవారు అనే వ్యత్యాసం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. మగ వాళ్లకు మాదిరిగానే ఆడవాళ్లకు కూడా సమానమైన హక్కులు కల్పిస్తున్నామని చెబుతూనే ఆడ వారిని చిన్నచూపు చూసేందుకు సిగ్గుగా లేదా అంటూ సోషల్ మీడియా ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చింది. మీరు ఇలా మీ అమ్మతోనో, అక్కతోనో వ్యవహరించగలరా అని ఎస్తర్ ఎమోషనల్ అయింది.