డాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ స్టెప్పులతో మాత్రమే కాక కామెడీతో కూడా ఫుల్ ఎంటర్టైన్ చేస్తారని అందరికీ తెలుసు. బిగ్బాస్ సీజన్ త్రీ లో బాబా భాస్కర్ చాలా జెన్యూన్ గేమ్ ఆడి చాలావరకు ఇంటిలో అప్పట్లో సందడి సందడిగా చేయడం జరిగింది. అనేక విషయాలు గురించి కొత్తకొత్తగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి వంట చేస్తూ… సీజన్ త్రీ లో చివరి వరకు టాప్ ఫోర్ లో నిలిచారు.
ప్రస్తుతం బాబా భాస్కర్ టెలివిజన్ రంగంలో దూసుకుపోతున్నారు. స్పెషల్ ఈవెంట్స్ చేసి తన స్టెప్పులతో అదరగొడుతున్నారు. ఒక స్టెప్పులు మాత్రమే కాక పంచ్ డైలాగులు వేస్తూ షోలో కామెడీ ఉండేలా చూసుకుంటున్నారు. ఇదిలా ఉండగా గత రెండు మూడు వారాలుగా పాపులారిటీ డ్యాన్స్ షో “డీ” లో జడ్జిగా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు. శేఖర్ మాస్టర్ కి కరోనా రావటంతో గత నెల రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నారు.
దీంతో శేఖర్ మాస్టర్ స్థానంలో బాబా మాస్టర్ రావటంతో….. తన పంచ్ డైలాగులతో దుమ్మురేపుతున్న డు. ఇదిలా ఉండగా వచ్చే వారం పూర్ణ తో కలిసి మాస్ రేంజ్ లో స్టెప్పులు వేసినట్టు కనిపిస్తుంది. ప్రోమో చూస్తుంటే బాబా భాస్కర్, పూర్ణాల పెర్ఫార్మెన్స్ దెబ్బకి టీవీ సెటప్ బాక్స్ లు హీటెక్కి పోయేటట్టు ఎపిసోడ్ షో నిర్వాహకులు ప్లాన్ చేసినట్లు అర్థమవుతుంది. మన్మధ రాజా మన్మధ రాజా అనే మాస్ సాంగ్ కి సంబంధించి వచ్చే వారం ఎపిసోడ్ లో బాబా భాస్కర్, పూర్ణ ఇద్దరు దుమ్ము లేపుతున్నారు. ఈ ప్రోమో చూసిన వీక్షకులు ఎపిసోడ్ కోసం ఎంతగానో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.