తన మత్తెక్కించే అందాలతోనే కాదు.. లెటెస్ట్ మోడల్ గన్స్‌తో కూడా తను కాల్చేస్తానని అంటుంది ఎవ్లిన్ శర్మ. ఈ జర్మనీ మోడల్.. యే జవానీ హై దివానీ సహా కొన్ని బాలీవుడ్ చిత్రాల్లో తన సొగసులతో మెప్పించింది. ఇప్పుడు మత్తైన సొగసులతో టాలీవుడ్ ప్రేక్షకులను మైమరిపించనుంది. ఈమె తెలుగులో ప్రభాస్ `సాహో` చిత్రంలో నటిస్తుంది. అందగత్తె కదా!… హీరోతో ఆడిపాడుతుందిలే అనుకుంటే తప్పే.. ఎందుకంటే ఈమె నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మిషన్ గన్ పట్టుకుని హీరో గ్యాంగ్ భరతం పడుతుందట. ఈమె షూటింగ్‌కు వెళ్లడానికి ముందు చేసిన గన్ ఫైర్ ప్రాక్టీసింగ్ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విడుదలయ్యాయి. గన్ పట్టుకుని కాల్చే సన్నివేశాల్లో ఎవ్లిన్ అబ్బో అనిపిస్తుంది మరి. ప్రభాస్ హీరోగా సుజిత్ తెరకెక్కిస్తున్న `సాహో` దసరాకు విడుదల కానుంది. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ ప్రభాస్‌తో జత కడుతుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
previous post
next post
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!