IPL 2023: ప్రస్తుతం ఐపీఎల్ 16వ సీజన్ జరుగుతుంది. నిన్న అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఐపీఎల్ స్టార్ట్ అయింది. ఓపెనింగ్ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. బీసీసీఐ చాలా ప్రతిష్టాత్మకంగా ఐపీఎల్ ప్రతి ఏడాది నిర్వహిస్తూ ఉంటది. అయితే గత రెండు మూడు సంవత్సరాలు కరోనా కారణంగా… పలు ఆంక్షలతో ఐపీఎల్ నిర్వహించారు. కానీ ఈసారి మాత్రం కరోనా ప్రభావం తగ్గటంతో ఎటువంటి ఆంక్షలు లేకుండా నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న రష్మిక మందన, తమన్నా ఇద్దరు డాన్స్ వేయడం తెలిసిందే.
కొద్ది నిమిషాల పాటు లైవ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ కార్యక్రమంలో భాగంగా వీళ్ళు వేసిన స్టెప్పులు… స్టేడియం లో మ్యాచ్ చూడటానికి వచ్చిన ఆడియన్స్ నీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. RRR, పుష్ప… సినిమాలలో హిట్ సాంగ్స్ కి స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయేలా స్టెప్పులు వేశారు. కేవలం కొద్దిపాటి నిమిషాలకు వీలు చేసిన పెర్ఫార్మన్స్ కి భారీ ఎత్తున రమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. హీరోయిన్ రష్మిక మందన ఏకంగా ఐదు కోట్లు చార్జి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా తమన్నా కి మూడు కోట్లు అందించినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే “ఐపీఎల్” వేడుకలకు ప్రతి ఏడాది బాలీవుడ్ హీరోయిన్స్ మాత్రమే వేసే వాళ్ళు. కానీ ఈసారి పూర్తిగా తెలుగు చలనచిత్ర రంగానికి సంబంధించిన రష్మిక మరియు తమన్నా స్టెప్పులు వేయటం విశేషం. ప్రస్తుతం భారతీయ చలనచిత్ర రంగంలో టాలీవుడ్ టైం నడుస్తోంది. పుష్ప సినిమాతో రష్మిక మందన సౌత్ తో తిట్టుగా నార్త్ లో కూడా క్రేజ్ సంపాదించుకుంది. దీంతో ఈ కన్నడ ముద్దుగుమ్మ ఐపీఎల్ వేదికపై ఎంట్రీ ఇవ్వగానే స్టేడియం హోరెత్తిపోయింది. ఆమెకున్న క్రేజ్ దృష్ట్యా రష్మిక కి నిర్వాహకులు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సమాచారం.