Rajanikanth: సీనియర్ హీరోలందరూ ఇప్పుడు యంగ్ డైరెక్టర్‌కు అవకాశాలిస్తున్నారు. వారైతే, తమ మీద అభిమానంతో..స్టార్ హీరోకు హిట్ ఇవ్వాలనే కసితో సినిమా తీస్తారని.. మంచి ఎనర్జీతో పనిచేస్తారని నమ్ముతున్నారు. టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత సీనియర్ దర్శకులకు కమిటైన సినిమా అంటే ఏదీ లేదనే చెప్పాలి. కొరటాలతో ఆచార్య, మెహర్ రమేశ్‌తో భోళా శంకర్, బాబీతో ఒక సినిమా, వెంకీ కుడుములతో ఒక సినిమాను చేస్తున్నారు. ఇక తమిళ దర్శకుడు మోహన్ రాజాతో గాడ్ ఫాదర్ చేస్తున్నారు. కొరటాల ఇప్పటి వరకు నాలుగు సూపర్ హిట్స్ తీశారు.
మోహన్ రాజాకు తమిళంలో హిట్ చిత్రాల దర్శకుడిగా మంచి పేరుంది. ఇలాగే కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఎక్కువగా కొత్త దర్శకులకే అవకాశాలిస్తున్నారు. అయితే వారిలో ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఆయనకు ఆశించిన సక్సెస్ ఇవ్వలేదు. ప్రముఖ దర్శకుడు కే ఎస్ రవికుమార్ రజనీతో లింగా సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఇది ఫ్లాప్ సినిమాల లిస్ట్‌లో చేరింది. క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
Rajanikanth: సూపర్ స్టార్‌కు హిట్ ఇచ్చి సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాడా..?
ఆ సినిమా వచ్చి ఇప్పటికే 12 ఏళ్ళు గడిచిపోయింది. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు రజనీ ఖాతాలో హిట్ పడలేదు. పా రంజిత్ దర్శకత్వంలో కబాలి, కాలా సినిమాలు చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా భారీ ఫ్లాప్స్‌గా మిగిలాయి. ఇక పిజ్జా డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజుతో పేటా, బ్లాక్ బస్టర్స్ తీసిన ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో దర్బార్, తమిళ స్టార్ అజిత్ కుమార్‌కు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన శివ దర్శకత్వంలో అణ్ణాత్తా లాంటి సినిమాలు చేసిన రజనీకి వీరెవరూ హిట్ ఇవ్వలేకపోయారు. దాంతో ఇప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్ మీద చాలా నమ్మకాలు పెట్టుకున్నారు తలైవర్. తన 69వ సినిమాకు దర్శకుడిగా ఆయనను ఎంచుకున్నారు రజనీ. ఇది నెల్సన్ దిలీప్ కెరీర్లో డైరెక్ట్ చేయబోతున్న 4వ సినిమా. ఇప్పటి వరకు హిట్స్ ఇచ్చిన నెల్సన్ ..సూపర్ స్టార్‌కు హిట్ ఇచ్చి సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాడా..?