ఎలాంటి సినీ పరిశ్రమ నేపథ్యం లేకుండా వెండితెరకు పరిచయమై తన నటనాశైలితో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మెగస్టార్ చిరంజీవి. ఆయన వయస్సు ఆరు పదులు దాటిన తర్వత కూడా సినిమాల్లో నటిస్తూ.. తనదైన నటన, డాన్స్, యాక్షన్స్ తో అదరగొట్టెస్తున్నారు చిరు. ఇటీవల సైరా అంటూ మనముందుకు వచ్చిన చిరు.. ఆ సినిమాలో తన నటవిశ్వరూపాన్ని చూపించారు.
అయితే, మెగస్టార్ తన అభిమానులకు మరింత చేరువగా ఉండేందుకు గతేడాది ఇన్‌స్టాగ్రామ్‌లో అగుడుపెట్టారు. ఈ నేపథ్యంలోనే చిరు తనకు సంబంధించిన పలు ఫొటోలను, వీడియోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తాజాగా చిరు తన ఇంటిని చూసిస్తూ.. అక్కడి సౌందర్యాన్ని, ప్రకృతి రమణీయతను తనలో దాగివున్న కవిని మేల్కొలుపుతూ వర్ణించారు.
అలాగే, ప్రకృతి పట్ల మానుషులు చేస్తున్న విధ్వంసంతో ఎంతగా దానిని మనం మిస్ అవుతున్నామనే సామాజిక విషయాన్ని కూడా అందులో ఆయన ప్రస్తావించారు. అయితే, ఆ వీడియోలు కనిపిస్తున్న మెగస్టార్ ఇల్లు సూపర్బ్ అనిపిస్తోంది. చిరు ఇదివరకూ షేర్ చేసిన ఫొటోల్లోనూ ఆయన ఇల్లు నిజంగానే ప్రకృతి సోయగాలతో ఇంధ్రభవనాన్ని తలపిస్తోంది. తన బాల్కానీలో ఉండి తీసిన వీడియోలో చిరు తన ఇల్లును అక్కడి అందాలను చూపించారు.
ఆ వీడియోలో సువిశాలమైన మొక్కలతో కూడిన గార్డెడ్ ఉంది. అక్కడే మంచి డిజైన్ లుక్‌లో కనిపిస్తున్న సిమ్మింగ్ ఫూల్ కూడా అద్దిరిపోతోంది. మరో వీడియోలో చిరు తన ఇంటి ముందు గార్డెన్తో కూడిన భాగంలో రాక్స్ ఉన్న దారిని చూపించారు. సహజంగా ఉంటే రాళ్లను అలానే ఉంచడంతో అక్కడి ప్రాంతం మరింత అందంగా కనిపిస్తోంది. అలాగే, ఇటీవల ఆయన చేపల పుసులు వండుతూ.. తన ఇంట్లోని కిచెన్‌ను చూపించారు. అలాగే, తన కుటుంబ సభ్యులతో ఇంట్లో దిగిన ఫొటోలలో తన ఇంటి సౌందర్యాన్ని చూపించారు. మీరు ఓ లుక్ వేయండి మరి !