న్యూస్ సినిమా

Rajamouli: మీ స్వార్ధం కోసం ఇలా చేస్తారా..రాజమౌళిపై వాళ్ళందరికీ మండిపోతోందట..!

Share

Rajamouli: మీ స్వార్ధం కోసం ఇలా చేస్తారా..రాజమౌళిపై వాళ్ళందరికీ మండిపోతోందట..!అంటూ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో, సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. వాస్తవంగా ఆలోచిస్తే ఇది నిజమే కూడా. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ విషయంలో చాలా స్వార్ధంగానే ప్రవర్తించారు. రిలీజ్ అనుకున్న ప్రతీసారి దరిదాపుల్లో మరో సినిమా ఏదీ రిలీజ్ కాకుండా ప్లాన్ వేశాడు. కానీ, అనూహ్యంగా మళ్ళీ ఆయనే వాయిదా వేస్తూ వచ్చారు. ఇలా ఇప్పటికే మూడుసార్లు కారణాలు ఏవైనా ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడింది. దీనివల్ల ఈ మూడుసార్లు చిన్న నుంచి మీడియం బడ్జెట్ సినిమాల వరకూ అన్నీ రీ షెడ్యూల్ చేయాల్సి వచ్చింది.

everyone are firing on rajamouli-
everyone are firing on rajamouli-

ఇక ఈసారి ఆగేది లేదంటూ నెల రోజుల నుంచి భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించారు. ఈసారి ఊపు చూస్తే ఆర్ఆర్ఆర్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేస్తారని అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. యూఎస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా కొంతవరకు జరిగిపోయాయి. కానీ, ఒమైక్రాన్ దెబ్బతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో వాయిదా వేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలపలేదు. ఏప్రిల్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని ఓ టాక్ వినిపిస్తోంది. అలాగే దసరా పండుగకు షెడ్యూల్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.

Rajamouli: రాజమౌళి మీద కోపం వస్తుందని ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ సంక్రాంతికి రావాల్సిన ఆచార్య, భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, ఎఫ్ 3 లాంటి సినిమాలు కేవలం ఆర్ఆర్ఆర్ కోసమే తమ రిలీజ్‌ను వాయిదా వేసుకున్నారు. ముఖ్యంగా భీమ్లా నాయక్ సినిమాను పట్టుపట్టి పోస్ట్‌పోన్ చేయించారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ వాయిదా అని ప్రకటించగానే అభిమానులకే కాదు మిగతా మేకర్స్‌కు రాజమౌళి మీద కోపం వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ మళ్ళీ రిలీజ్ డేట్ ప్రకటించినా ఈ సారి ఆర్ఆర్ఆర్ కోసం మాత్రం ఏ సినిమాను అనుకున్న తేదీ నుంచి తప్పించుకునే పరిస్థితి ఉండదని చెప్పుకుంటున్నారు.


Share

Related posts

అతిజాగ్రత్తలు తీసుకుంటున్న చరణ్

Siva Prasad

YS Jagan: ఒక డైరీ వెనుక మొండి ధైర్యం..! జగన్ అమూల్ కథలో నీతి ఏమిటి..!?

Muraliak

Prabhas: సిగరెట్ వెలిగిస్తూ ద‌ర్శ‌న‌మిచ్చిన‌ ప్ర‌భాస్‌.. నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

kavya N