Entertainment News సినిమా

సల్మాన్ ఖాన్ ఓ శాడిస్ట్ అంటూ మాజీ ప్రియురాలు సంచలన వ్యాఖ్యలు..!!

Share

బాలీవుడ్ కండలు వీరుడు సల్మాన్ ఖాన్ 50 సంవత్సరాలు దాటిన గాని ఇప్పటివరకు పెళ్లి కాకపోవడం తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న సల్మాన్ చాలా మందితో లవ్ ట్రాక్ లు నడపడం జరిగింది. అయితే వీరిలో ఒకరు సోమీ అలీ. పాకిస్తాన్ దేశానికి చెందిన
సోమీ అలీతో అప్పట్లో లవ్ ట్రాక్ నడపటం జరిగింది. సోమీ అలీ ప్రస్తుతం అమెరికాలో స్థిరపడి ఎన్జీవో నడిపిస్తుంది. ఈ క్రమంలో తాజాగా సల్మాన్ ఖాన్ పై వైరల్ కామెంట్లు చేసింది. సల్మాన్ ఖాన్ కి మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించే వ్యక్తిత్వము ఉందని విమర్శలు చేసింది. తనతో పాటు ఇతర మహిళలపై సల్మాన్ ఖాన్ చేయి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి, అతనొక శాడిస్ట్ అని సోమీ అలీ ఆరోపణలు చేసింది.

Ex-girlfriend's sensational comments saying Salman Khan is a sadist

సల్మాన్ ఖాన్ గురించి బయటకు తెలియని కోణం చాలా ఉంది కాబట్టి అతనిని పెద్దగా పొగడకూడదు అంటూ సోమీ అలీ హితవు పలికింది. సోమీ అలీతో కలసి అప్పట్లో సల్మాన్ ఖాన్ ఒక సినిమా చేశారు. అయితే ఆ సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఆగిపోయింది. అయినా కానీ వీరిద్దరూ కొంతకాలం పాటు ప్రేమలో ఉండటం జరిగింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఇద్దరు విడిపోయారు.

Ex-girlfriend's sensational comments saying Salman Khan is a sadist

అయితే చాలాకాలం తర్వాత సోమీ అలీ సల్మాన్ ఖాన్ పై కాంట్రవర్సీ కామెంట్ చేయడం సంచలనం సృష్టించింది. ఇలా ఉంటే అప్పట్లో తన ప్రియురాలు గా ఉన్న ఐశ్వర్యరాయ్ పై కూడా సల్మాన్ చేయి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. సల్మాన్ తన కెరియర్ మొత్తంలో చాలామంది హీరోయిన్లతో లవ్ ట్రాక్ నడపడం జరిగింది. కాగా ప్రస్తుతం సల్మాన్ వయసు 50 సంవత్సరాలుగా పైగానే ఉండటంతో ఇప్పటికీ పెళ్లి కాకపోవడంతో… బాలీవుడ్ హీరోలలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉన్నాడు.


Share

Related posts

2022లో మీకు ఇష్టమైన టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు ఇవేనా?

Siva Prasad

18 ఏళ్ల తర్వాత సీక్వెల్‌

Siva Prasad

Review : రివ్యూ : గాడ్జిల్లా vs కాంగ్

siddhu