సినిమా

దృశ్యం 3 నుంచి అదిరిపోయే అప్‌డేట్.. చివరికి హీరో అరెస్ట్ అవుతాడా..?

Share

 

ఆద్యంతం ట్విస్టులు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో కట్టిపడేసిన దృశ్యం, దృశ్యం-2 సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ విభిన్న కథలు ఎంచుకోవడంలో ఎప్పుడూ ముందుంటాడు. అందుకే దృశ్యం వంటి క్రైమ్ థ్రిల్లర్‌లో నటించడానికి ఒప్పుకున్నాడు. ఈ సినిమాలోని అదిరిపోయే స్టోరీ, జార్జి కుట్టి గా మోహన్‌ లాల్ యాక్టింగ్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. జీతూ జోసెఫ్ అత్యద్భుతంగా డైరెక్ట్ చేసిన దృశ్యం సినిమా, దానికి సీక్వెల్ గా దృశ్యం-2 భారీ విజయాలు సొంతం చేసుకున్నాయి.

ఇంకా అయిపోలేదు ఇప్పుడే మొదలైంది!

ఇక ఈ చిత్రాలను తెలుగులోనూ రీమేక్ చేసారు. దృశ్యం థియేటర్స్ లో విడుదల కాగా దృశ్యం-2 ఓటీటీలో విడుదల అయింది. ఇవి రెండూ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. తెలుగులో వెంకటేష్ హీరోగా నటించగా మీనా హీరోయిన్ గా చేశారు. ఈ రెండు సినిమాలలో ట్విస్ట్స్‌ మైండ్ బ్లోయింగ్ అని చెప్పవచ్చు. ఒక్క సెకండు కూడా కళ్ళార్పకుండా చూసేలా దృశ్యం టూ చేసిందంటే అతిశయోక్తి కాదు. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమా భారత దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అయితే పార్ట్-2తో కూడా ఈ సినిమాకి ఇంకా ఎండ్ కార్డు పడలేదు.

దృశ్యం-3, ది కంక్లూషన్

తాజాగా దృశ్యం-3, ది కంక్లూషన్ అంటూ చిత్ర పోస్టర్ ను మేకర్స్ విడుదల చేసారు. పోస్టర్ లో హీరో మోహన్ లాల్ సంకెళ్లతో కనిపిస్తున్నారు. దృశ్యం-2 సినిమా చివరిలో ఈ కథ ఇంకా ముగిసిపోలేదు.. మళ్లీ ఏ రోజైనా పోలీసులు రావొచ్చు.. గతాన్ని తిరిగి తోడొచ్చు అంటూ మోహన్ లాల్ చెప్పిన డైలాగ్ తోనే ఈ సినిమాకు ఇంకో పార్ట్ ఉందని హింట్ ఇచ్చేసాడు డైరెక్టర్. తాజాగా పోస్టర్ రిలీజ్ తో కన్ఫర్మేషన్ ఇచ్చేసారు మేకర్స్. దృశ్యం-3 లో ట్విస్టులు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమా ను వచ్చే ఏడాది విడుదల కావొచ్చు అని తెలుస్తోంది.


Share

Related posts

Kajal Aggarwal Beautiful White Dress Stills

Gallery Desk

Sekhar Kammula: డైరెక్టర్ శేఖర్ కమ్ముల కి సినిమా సెట్ లో కోపం వస్తే ఏం చేస్తాడో తెలుసా..??

sekhar

PK Sequel : అమీర్ ఖాన్ పీకే కు సీక్వెల్ రాబోతోందా… దర్శకుడు ఏమంటున్నాడు..?

Teja