Jagapathi Babu: ప్రముఖ నటుడు జగపతిబాబు గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకె కాక దక్షిణ భారత సినిమా లు చూసే వారికీ ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ఆయన ఇదివరలో ఎన్నో సినిమాల్లో హీరోగా, విలన్ గా నటించారు విజయాలు సాధించారు . విలక్షణమైన ప్రతినాయకుడిగా మెప్పించడమే కాకుండా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ అలరిస్తున్నారు. వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకుంటోన్న జగపతిబాబు ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ మధ్య తాను పోషిస్తున్న పాత్రలన్నీ బాగానే ఉన్నాయి కానీ పవర్‌ఫుల్‌గా అనిపించలేదనే అర్థంలో ఓ ప్రకటన ఇచ్చారు.

KGFతో సంచలనం సృష్టించిన ప్రశాంత నీల్ దర్శకత్వంలో తెరెక్కుతోన్న మూవీ సలార్. ఇందులో ప్రభాస్ హీరో అని అందరికీ తెలుసు, ‘సలార్’లో . శ్రుతి హాసన్ హీరోయిన్ గా, మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్ గా, శ్రియారెడ్డి, మరికొంతమంది స్టార్ ఆర్టిస్టులు ముఖ్య పాత్రలలో నటిస్తుండగా భారీ మాస్ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతోంది సలార్. బాహుబలి తర్వాత అభిమానులంతా సలార్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు.ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి లీకైన ప్రభాస్ లుక్ చూసి ఫిదా అయిన ఫ్యాన్స్ తాజాగా రిలీజైన జగ్గుభాయ్ అదేనండీ మన జగపతి బాబు లుక్ చూసి వామ్మో అంటున్నారు.
కుటుంబ కదా చిత్రాల హీరో ఇంత భయంకరంగా మారాడా..అని ఆశ్చర్య పోతున్నారు. .ప్రభాస్ సలార్ మూవీలో జగ్గుభాయ్ లుక్ చూసినవాళ్లు. సలార్ లో జగ్గూ భాయ్ ని ఇంత వికృతంగా చూడగలరా? అనే సందేహం కలుగుతుంది.

అత్యంత భారీ తారాగణంతో KGF, KGF2కి దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ రూపొందిస్తోన్న మూవీ సలార్. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినషన్ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ లుక్ లీకులు అందగా అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. ఇపుడు సలార్ నుంచి రిలీజైన జగపతి బాబు లుక్ సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది.ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. ఇక ఈ సినిమాలో జగపతిబాబు రాజమన్నార్ అనే పవర్ ఫుల్ విలన్ గా కనిపించబోతున్నారు. ఇప్పటికే జగపతి బాబు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. అత్యంత భయంకరంగా ఉంది ఆయన వేషధారణ.
Salaar: ప్రశాంత్ నీల్ ఈ ఒక్క తప్పు చేయకుండా ఉండి ఉంటే సలార్ పోస్ట్ పోన్ అయ్యేదే కాదు !
దీని గురించి జగపతి బాబు మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు. సలార్ పార్ట్ 1లో తనకు , ప్రభాస్ కి కాంబినేషన్ లో అసలు సీన్స్ లేవు అని తాను పార్ట్ 1లో. కొద్దిసేపే కనిపిస్తాను అనీ పార్ట్ 2లో మాత్రం ఇద్దరి మధ్య మంచి సీన్స్ ఉంటాయి అని చెప్పారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది అని తెలిపారు. ఇక సలార్ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

సలార్‌లో జగపతిబాబు రాజమన్నార్ అనే ఒక పాత్రలో కనిపించనున్నాడు. ఇది ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాత్రల్లో ఒకటిగా ప్రచారమవుతోంది. అతడి గెటప్ చూస్తుంటే క్రూరమైన విలన్‌గా నటిస్తున్నాడని అర్థమవుతోంది. మాసిన గడ్డం మీసకట్టు, చెదిరిన తలతో భృకుటి ముడివేసి ముడుతలు పడిన ముఖంతో జగపతిబాబు లుక్ మొత్తం మారిపోయింది. ముక్కుకు ముక్కెర పెట్టుకుని చుట్ట తాగుతూ క్రూరంగా కనిపిస్తున్నాడు.
Salaar: సలార్ వాయిదా గురించి మొట్టమొదటిసారి స్పందించిన ప్రభాస్ – ఒకే ఒక్క మాట అన్నాడు !
సలార్ మూవీలో మీ లుక్ రివీల్ చేశారుగా ఆ పాత్ర ఎలా ఉంటుంది అని అడిగినప్పుడు దానికి జగపతి బాబు ఇలా అన్నారు ‘‘నిజానికి లుక్ కోసం ఏదో వెరైటీగా ఉండాలని ట్రై చేశారు. అది చాలా బాగా వచ్చింది. మరి షూటింగ్ సమయానికి అది సినిమాలో ఎలా కుదురుతుందో చూడాలి. అదే నా భయం కూడా. సలార్ సినిమాను తలుచుకుంటే రాజమన్నార్ పాత్రలో జీవించాలి అంటే చాలా కష్టం అన్నారు. . అయితే డైరెక్టర్ ప్రశాంత నీల్‌పై చాలా నమ్మకం ఉంది. నేను, ప్రశాంత్ ఏదో చేస్తాం. ప్రశాంత్ కూడా చాలా పర్టికులర్‌గా ఉన్నాడు. తను పాత్రను పవర్‌ఫుల్‌గా చూపిస్తాడు. సాలిడ్ మూవీ. సాలిడ్ క్యారెక్టర్. కాబట్టి నా పాత్రను ఎలా చూపిస్తాడో చూడాలి. అయితే నటుడిగా మరో మెట్టుకు ఎక్కుతాననే అనుకుంటున్నాను. నా పాత్రకు సంబంధించిన షూటింగ్ ఇంకా జరగలేదు. త్వరలోనే జరగబోతుంది’’ అన్నారు జగపతి బాబు. మరి చిత్రీకరణలో ప్రశాంత్ నీల్ జగపతి బాబు భయాన్ని పోగొట్టి.. ఆయన పాత్రను అద్భుతంగా ప్రెజెంట్ చేయాలనే కోరుకుందాం. జగపతి బాబు పాత్ర ఎలా వుండబోతోంది అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. జగపతిబాబు పాత్ర సినిమా విజయానికి దోహదం చేస్తుందని ఆశిద్దాము.