F 3 – Major: కరోనాకు ముందు వరకు బాక్సాఫీస్ వద్ద రెండు కాదు ఏకంగా ఒకే రోజు మూడు నాలుగు సినిమాలు రిలీజైన సందర్భాలు కోకొల్లలు. కానీ, కరోనా ప్యాండమిక్ తర్వాత సినిమా ఇండస్ట్రీలలో పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. ఇప్పటికే వేల కోట్ల నష్టాలలోకి వెళ్ళిపోయిన చిత్రపరిశ్రమ దానిని భర్తీ చేసేందుకు శత విధాలా మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే తమ సినిమాలను చాలా జాగ్రత్తగా ఆలోచించి తమ సినిమాకి ముందు రెండు వారాలు ఆ తర్వాత రెండు వారాలు మరో సినిమా రిలీజ్ కాకుండా చూసుకుంటున్నారు. ఇప్పుడు తెలుగులో రిలీజ్ అవుతున్న పెద్ద సినిమాలన్నీ అలాగే సోలో డేట్‌తో వస్తున్నాయి.
కానీ, రెండు సినిమాలు మాత్రం ఒకే రోజు విడుదల కాబోతున్నాయి. ఆ చిత్రాలే ఎఫ్ 3, మేజర్. ఇప్పటికే ఎఫ్ 3 సినిమాను మే 27న విడుదల చేయబోతున్నామని మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు. విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్ 3 సినిమాకు అనీల్ రావిపూడి దర్శకుడు. ఇక ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన ఎఫ్ 2 ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఖచ్చితంగా ఎఫ్ 3 సినిమాపై సహజంగానే అంచనాలు భారీగా నెలకొన్నాయి. అందుకే ఈ సినిమాను మిగతా సినిమాలతో పోటీ లేకుండా సోలోగా రిలీజ్ చేయాలనుకున్నారు.
F 3 – Major: చివరి దశలో ఏదైనా ఒకటి
తప్పుకుంటుందా..?
అయితే, మేజర్ సినిమాను మాత్రం అదే తేదీకి విడుదల చేయాలని ఆ చిత్రబృందం భావించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వసూళ్ల పరంగా రెండు సినిమాలకు గ్యారెంటీగా మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం అంటే ఖచ్చితంగా ఎఫ్ 3 మేజర్ సినిమాలకు బాగానే నష్టం వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. అడవి శేష్ – సాయీ మంజ్రేకర్ హీరో హీరోయిన్స్‌గా నటించిన ఇందులో శోభిత దూళిపాళ్ల కీలక పాత్రలో కనిపించబోతున్నారు. శశి కిరణ్ తిక్కా దీనికి దర్శకుడు. మరి ఇలా రెండు సినిమాలు ఒకేరోజు వస్తాయా..చివరి దశలో ఏదైనా ఒకటి తప్పుకుంటుందా అనేది కొన్నాళ్ళు ఆగితే గానీ తెలీదు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!