దిల్‌రాజు నిర్మాతగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ నటించిన హిలేరియస్ ఎంటర్టైనర్ `F2`. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై ఈ చిత్రం 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి దక్షిణాదిన హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఈ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ హిందీలోరీమేక్ చేయబోతున్నారు. ఈ సినిమా నిర్మాణంలో టాలీవుడ్ హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు భాగమవుతున్నారు. బాలీవుడ్లో `నో ఎంట్రీ` సినిమాను తెరకెక్కించిన దర్శకుడు అనీస్ బాజ్మీ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బాలీవుడ్‌లోని ముగ్గురు లీడ్ యాక్టర్స్ నటించబోతున్నారు.త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.