Subscribe for notification
Categories: సినిమా

F3: `ఎఫ్ 3` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. స‌మ్మ‌ర్ సోగాళ్లు అద‌ర‌గొట్టేశారంతే!

Share

F3: 2019లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన `ఎఫ్ 2`కు సీక్వెల్‌గా రూపుదిద్దుకున్న చిత్రమే `ఎఫ్ 3`. విక్ట‌రీ వెంకటేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రంలో వెంకీకు జోడీగా మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా, వ‌రుణ్ స‌ర‌స‌న మెహ్రీన్ న‌టించారు.

బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్, సునీల్‌, రాజేంద్ర ప్ర‌సాద్, ముర‌ళీ శ‌ర్మ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. భారీ అంచ‌నాల న‌డుమ నిన్న విడుద‌లైన ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. డ‌బ్బు, దాని వ‌ల్ల వ‌చ్చే ఫ్రస్టేషన్ నేప‌థ్యంలో ఈ మూవీ సాగుతుంది. వెంకటేష్- వరుణ్ తేజ్-తమన్నాల‌ నటన, కావాల్సినంత వినోదం, క్లైమాక్స్ వంటివి సినిమాలో విశేషంగా ఆక‌ట్టుకుంటాయి.

అలాగే వెంక‌టేష్‌ రేచీక‌టి ఉన్న వ్య‌క్తిగా న‌టిస్తే, వ‌రుణ్‌ న‌త్తితో ఇబ్బంది ప‌డే యువ‌కుడిగా ప్రేక్ష‌కుల‌ను బాగానే అల‌రించారు. అదే స‌మ‌యంలో బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్స్ విష‌యంలోనూ ఈ స‌మ్మ‌ర్ సోగాళ్లు అద‌ర‌గొట్టేశారు. తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 10.35 కోట్ల షేర్ వ‌సూల్ చేసిన ఈ చిత్రం.. వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 13.35 కోట్లు షేర్‌ను సొంతం చేసుకుంది. రూ. 64.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఈ చిత్రం.. క్లీన్ హిట్‌గా నిల‌వాలంటే ఫస్ట్ డే కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 51.15 కోట్ల షేర్‌ను రాబ‌ట్టాల్సి ఉంది. ఇక ఏరియాల వారీగా `ఎఫ్ 3` ఫ‌స్ట్ డే టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓ సారి గ‌మ‌నిస్తే..

నైజాం: 4.06 కోట్లు
సీడెడ్: 1.26 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 1.18 కోట్లు
తూర్పు: 0.76 కోట్లు
పశ్చిమ: 0.94 కోట్లు
గుంటూరు: 0.88 కోట్లు
కృష్ణ: 0.66 కోట్లు
నెల్లూరు: 0.61 కోట్లు
———————
ఏపీ+తెలంగాణ‌= రూ. 10.35 కోట్లు(రూ. 17 కోట్లు~ గ్రాస్)
———————

క‌ర్ణాట‌క‌+రెస్ట్ ఆఫ్ ఇండియా: 0.85 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 2.15 కోట్లు
———————
వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్‌= రూ.13.35కోట్లు(23కోట్లు~ గ్రాస్)
———————

 


Share
kavya N

Recent Posts

pushpa 2: `పుష్ప 2`లో న‌టించాల‌నుందా..? అయితే ఇదిగో బిగ్ ఆఫ‌ర్‌!

pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న పాన్…

18 mins ago

Hero Yash: పాన్ ఇండియా నిర్మాతల వేటలో హీరో యశ్

Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…

48 mins ago

Pakka Commercial: `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` ఓటీటీ రైట్స్ ధ‌రెంతో తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`.…

1 hour ago

Sudigali Sudheer : సుధీర్‌పై నాగబాబు సెటైర్లు.. మళ్లీ ఒకే చోట చేరిన గ్యాంగ్..

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…

2 hours ago

Rashmika: కెరీర్‌లో పెద్ద టర్నింగ్‌ పాయింట్ ఆ సినిమానే అంటున్న ర‌ష్మిక‌!

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి అన‌తి…

2 hours ago

Pears: తప్పనిసరిగా తినాల్సిన పండు ఇది..!

Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…

2 hours ago