F3: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన తాజా మల్టీస్టారర్ చిత్రమే `ఎఫ్ 3`. సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా టాలీవుడ్లో సత్తా చాటుతున్న అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించగా.. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా చేశారు.
రాజేంద్రప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ కీలక పాత్రలను పోషించారు. `ఎఫ్ 2`కు సీక్వెల్‌గా రూపుదిద్దుకున్న ఈ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మే 27న విడుదలై.. గుడ్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా ఎట్రాక్ట్ చేస్తున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
రూ. 64.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ.. తాజాగా తొలి వారాన్ని పూర్తి చేసుకుంది. ఫస్ట్ వీక్‌లో ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 48.17 కోట్ల షేర్.. రూ. 80.40 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. క్లీన్ హిట్‌గా నిలవాలంటే ఫస్ట్ వీక్ వచ్చిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 16.33 కోట్ల షేర్‌ను రాబట్టాల్సి ఉంది. ఇక ఏరియాల వారీగా ఎఫ్ 3 ఫస్ట్ వీక్ టోటల్ కలెక్షన్స్‌ను ఓ సారి గమనిస్తే..
నైజాం: 16.40 కోట్లు
సీడెడ్: 5.38 కోట్లు
ఉత్తరాంధ్ర: 5.18 కోట్లు
తూర్పు: 2.86 కోట్లు
పశ్చిమ: 2.10 కోట్లు
గుంటూరు: 2.82 కోట్లు
కృష్ణ: 2.48 కోట్లు
నెల్లూరు: 1.55 కోట్లు
———————
ఏపీ+తెలంగాణ= రూ. 38.77 కోట్లు(రూ.62.15 కోట్లు~ గ్రాస్)
———————
కర్ణాటక+రెస్ట్ ఆఫ్ ఇండియా: 2.65 కోట్లు
ఓవర్సీస్: 6.75 కోట్లు
———————
వరల్డ్ వైడ్ కలెక్షన్= రూ.48.17కోట్లు(80.40 కోట్లు~ గ్రాస్)
———————