Subscribe for notification
Categories: సినిమా

F3: జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న `ఎఫ్ 3`.. 2 డేస్‌లో వ‌చ్చిందెంతో తెలుసా.

Share

F3: విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ క‌లిసి న‌టించిన తాజా మ‌ల్టీస్టార‌ర్ చిత్ర‌మే `ఎఫ్ 3`. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం గ‌తంలో విడుద‌లైన సూప‌ర్ హిట్ మూవీ `ఎఫ్ 2`కు సీక్వెల్‌. ఇందులో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా న‌టించ‌గా.. రాజేంద్రప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. పూజా హెగ్డే స్పెష‌ల్ సాంగ్ చేసింది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ ఔట్ అంట్ ఔట్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ మే 27న గ్రాండ్‌గా రిలీజ్ అయింది. క‌థ పెద్ద‌గా ఏమీ లేక‌పోయినా.. ప్రేక్ష‌కుడికి కావాల్సినంత ఎంట‌ర్టైన్‌మెంట్ ఉండ‌టంతో తొలి షో నుంచే ఈ మూవీ పాజిటిక్ టాక్ సొంతం చేసుకుంది. అలాగే వెంక‌టేష్‌ రేచీక‌టి ఉన్న వ్య‌క్తిగా న‌టిస్తే, వ‌రుణ్‌ న‌త్తితో ఇబ్బంది ప‌డే యువ‌కుడిగా చేసి ఆక‌ట్టుకున్నాయి.

మొత్తానికి టాక్ బాగుండ‌టంతో ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్స్ ప‌రంగా జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 10.35 కోట్ల షేర్ వ‌సూల్ చేసిన ఈ చిత్రం.. రెండో రోజు రూ 7.5 కోట్ల షేర్‌ను కొల్ల‌గిట్టింది. అలాగే వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ మూవీ 2 డేస్‌లో రూ. 23.50 కోట్ల షేర్‌.. రూ. 39.80 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను అంద‌కుంది. ఇక ఏరియాల వారీగా `ఎఫ్ 3` 2 డేస్‌ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓ సారి గ‌మ‌నిస్తే..

నైజాం: 8.16 కోట్లు
సీడెడ్: 2.38 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 2.22 కోట్లు
తూర్పు: 1.28 కోట్లు
పశ్చిమ: 1.22 కోట్లు
గుంటూరు: 1.42 కోట్లు
కృష్ణ: 1.17 కోట్లు
నెల్లూరు: 0.85 కోట్లు
———————
ఏపీ+తెలంగాణ‌= రూ. 18.70 కోట్లు(రూ. 30.25 కోట్లు~ గ్రాస్)
———————

క‌ర్ణాట‌క‌+రెస్ట్ ఆఫ్ ఇండియా: 1.20 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 3.60 కోట్లు
———————
వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్‌= రూ.23.50కోట్లు(39.80కోట్లు~ గ్రాస్)
———————

కాగా, రూ. 64.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఈ చిత్రం.. బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిల‌వాలంటే మొద‌టి రెండు రోజులు వ‌చ్చిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 41 కోట్ల షేర్‌ను రాబ‌ట్టాల్సి ఉంది. ఇప్పుడున్న జోరునే కొన‌సాగిస్తే లాంగ్ ర‌న్‌లో ఎఫ్ 3 ఆ టార్గెట్ ను అందుకోవ‌డం ఖాయం.


Share
kavya N

Recent Posts

Mango: మామిడి పండ్లు తిన్న వెంటనే వీటిని తినకూడదు.. తింటే ఏం జరుగుతుందంటే.!?

Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…

27 mins ago

Hero Ram: ప్రియురాలితో పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన రామ్‌!

Hero Ram: టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడంటూ గ‌త కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…

27 mins ago

AP Employees: జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము మాయంపై ఆర్ధిక శాఖ ఉన్నతాధికారిని కలిసిన ఏపి ఉద్యోగ సంఘాల నేతలు… అసలు విషయం ఇదీ

AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…

39 mins ago

Rice Idly: మిగిలిన అన్నం పరేయకుండా క్షణాల్లో మెత్తటి ఇడ్లీ చేసేయండీలా..!

Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…

1 hour ago

Bihar Politics: ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు బీహారీ ముస్లిం నేతలు

Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…

2 hours ago

Pain Killer: ఒక్క గ్లాస్ ఈ డ్రింక్ తాగితే అన్నిరకాల శారీరక నొప్పులు ఫటాఫట్..!

Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…

2 hours ago