F3 Movie: 2019 సంక్రాంతి సందర్భంగా విడుదలైన `ఎఫ్ 2` చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడీ హిట్ మూవీకి సీక్వెల్‌గా `ఎఫ్ 3` రాబోతోంది. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపుదిద్దుకుంది.
ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించగా.. సోనాల్ చౌహాన్, సునీల్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలను పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర టీమ్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇందులో భాగంగానే తాజాగా ఎఫ్ 3 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డేట్ లాక్ చేశారు. ఈ నెల 21న హైదరాబాదులో ఎఫ్ 3 ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు. శిల్పకళావేదిక ప్రాంగణంలో సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం జరగనుంది. ఈ విషయాన్ని చిత్రనిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధికారికంగా వెల్లడించింది.
అయితే ఈ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పెషల్ గెస్ట్‌గా వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్‌కు అనిల్ రావిపూడి మంచి సన్నిహితుడు. ఈ నేపథ్యంలోనే ఆయన ఎఫ్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్ వచ్చే ఛాన్సులు ఉన్నాయని అంటున్నారు. మరి నిజంగా ఎన్టీఆర్ వస్తే.. ఈ మూవీపై మరిన్ని అంచనాలు పెరగడం ఖాయం అవుతుంది.