33.7 C
Hyderabad
March 31, 2023
NewsOrbit
సినిమా

F3: `ఎఫ్ 3` స్పెషల్ సాంగ్‌.. వెంకీ, వ‌రుణ్‌ల‌తో డ్యాన్స్ ఇర‌గ‌దీసిన పూజా హెగ్డే!

Share

F3: విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ఎఫ్ 3`. 2019లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన `ఎఫ్ 2`కు ఇది సీక్వెల్‌. ఇందులో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా, మెహ్రీన్ కౌర్ హీరోయిన్లుగా న‌టించ‌గా.. బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్, సునీల్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం మే 27న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. అలాగే సినిమాకు సంబంధించి వ‌రుస అప్డేట్స్‌ను వ‌దులుతూ హైప్‌ను పెంచుతున్నారు. ఇక‌పోతే ఈ సినిమాలో బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే స్పెష‌ల్ సాంగ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఆ స్పెష‌ల్ సాంగ్‌ను మేక‌ర్స్ కొద్ది సేప‌టి క్రిత‌మే బ‌య‌ట‌కు వ‌దిలారు. `లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా ..` అంటూ సాగే ఈ పాట‌కు కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని సమకూర్చగా, రాహుల్ సిప్లి గంజ్-గీతామాధురి ఆలపించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అలాగే రాజు సుందరం కొరియో గ్రఫీని అందించారు.

స‌ర‌దాగా సాగే ఈ పార్టీ సాంగ్‌లో వెంకీ, వ‌రుణ్‌ల‌తో క‌లిసి పూజా హెగ్డే డ్యాన్స్ ఇర‌గ‌దీసింది. వీరు ముగ్గురు వేసిన స్టెప్పులు పాట‌కే హైలెట్‌గా నిలిచాయి. మొత్తానికి ఇప్పుడీ స్పెష‌ల్ సాంగ్ యూట్యూబ్‌లో వైర‌ల్‌గా మారింది. కాగా, ఈ చిత్రంలో వెంకీ రేచీక‌టి ఉన్న వ్య‌క్తిగా న‌టిస్తే.. వ‌రుణ్ న‌త్తి స‌మ‌స్య‌తో ఇబ్బందులు ప‌డే యువ‌కుడిగా చేశాడు.


Share

Related posts

త‌ల్లిదండ్రులు చూడాల్సిన చిత్రం

Siva Prasad

Venkatesh : వెంకటేష్ ‘ దృశ్యం 2 ‘ సూపర్భ్ అంటూనే రిజెక్ట్ చేయడానికి కారణం పెద్దదే ..?

GRK

Devatha Serial: రుక్మిణిలా ఉన్న రాధ ఆదిత్యకు నిజం చెప్పేస్తుందా..!?

bharani jella